లార్జ్ క్యాప్ షేర్లేబెటర్..
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:38 AM
గత వారం కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్, మీడియా కంపెనీల షేర్లు మంచి లాభాలతో ముగిశాయి. ఎఫ్‌ఐఐల కొనుగోళ్లతో బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల షేర్లలో మళ్లీ బుల్లిష్‌నెస్ కనిపిస్తోంది...
గత వారం కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్, మీడియా కంపెనీల షేర్లు మంచి లాభాలతో ముగిశాయి. ఎఫ్‌ఐఐల కొనుగోళ్లతో బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల షేర్లలో మళ్లీ బుల్లిష్‌నెస్ కనిపిస్తోంది. ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు, చమురు ధర తగ్గడం, ప్రధాన కరెన్సీలతో డాలర్ మారకం రేటు నీరసించడం, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్ల కోతకు సిద్ధమవడం ఈ వారం మార్కెట్‌కు కలిసొచ్చే అంశాలు. అయినా ఈ వారం సూచీలు మిశ్రమంగానే ట్రేడయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఈ వారంలో కూడా 25000 శ్రేణిలోనే కొనసాగ వచ్చు. మదుపరులు ఈ వారం లార్జ్ క్యాప్ షేర్లలో కొనసాగడమే మంచిది.
స్టాక్ రికమండేషన్లు
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్: ఆగస్టులో ఈ కంపెనీ షేర్లు జీవితకాల గరిష్ఠస్థాయిని తాకాయి. అయితే హెడ్‌లైన్ సప్లై రావడంతో ఒక్కసారిగా 23 శాతం మేర దిద్దుబాటుకు లోనయ్యాయి. ప్రస్తుతం కీలక మద్దతు స్థాయి రూ.700 వద్ద ట్రేడవుతున్నాయి. రిలెటివ్ స్ట్రెంత్ పెరగడం, కొనుగోళ్ల మద్దతుతో ఈ కౌంటర్‌లో మళ్లీ అప్‌ట్రెండ్ కనిపిస్తోంది. శుక్రవారం 2.79 శాతం లాభంతో రూ.723 వద్ద ముగిశాయి. రూ.770/805 టార్గెట్‌తో మదుపరులు రూ.720/700 శ్రేణిలో ఈ కౌంటర్లో పొజిషన్లు తీసుకోవ చ్చు. అయితే రూ.685ను గట్టి స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
పిరామల్ ఎంటర్‌ప్రైజెస్: రెండేళ్లుగా డౌన్‌ట్రెండ్‌లో ఉన్న ఈ కంపెనీ షేర్లలో గోల్డెన్ క్రాస్ ఓవర్‌తో మళ్లీ అప్‌ట్రెండ్ కనిపిస్తోంది. రూ.800 వద్ద మద్దతు తీసుకున్న ఈ కౌంటర్ ప్రస్తుతం రూ.1,120 వద్ద గట్టి నిరోధం ఎదుర్కొంటోంది. దీనిని అధిగమిస్తే అప్‌ట్రెండ్ మరింత బలపడుతుంది. శుక్రవారం ఈ కంపెనీ షేర్లు 4.69 శాతం లాభంతో రూ.1,119 వద్ద ముగిశాయి. రూ.1,250/1,310 టార్గెట్‌తో మదుపరులు రూ.1,100 స్థాయిలో ఈ కౌంటర్లో పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.1,070ను స్ట్రిక్ట్ స్టాప్ లాస్‌గా పెట్టుకోవాలి.
బంధన్ బ్యాంక్ : చాలా కాలంగా డౌన్‌ట్రెండ్‌లో ఉన్న ఈ కౌంటర్లో ప్రస్తుతం బేస్ ఏర్పడుతోంది. మరోసారి కీలక మద్దతు స్థాయి రూ.170 వద్ద బలం కనిపిస్తోంది. చివరి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుండడం, డివిడెండ్ ప్రకటనతో ప్రస్తుతం ఈ బ్యాంక్ షేర్లలో సంస్థాగత మదుపరులు కూడా పెట్టుబడి పెడుతున్నారు. ఈపీఎస్ సైతం 1841 శాతం పెరిగింది. శుక్రవారం 5.41 శాతం లాభంతో రూ.207 వద్ద ముగిశాయి. రూ.245 టార్గెట్‌తో మదుపరులు ఈ కౌంటర్లో రూ.205/200 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.190ను కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
గోద్రెజ్ ప్రాపర్టీస్: జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరాక, ఈ కంపెనీ షేర్లు 16 శాతం వరకు దిద్దుబాటుకు లోనయ్యాయి. ప్రస్తుతం ఈ కౌంటర్లో కన్సాలిడేషన్ కొనసాగుతోంది. రూ.2,850 స్థాయిలో మద్దతు లభించింది. శుక్రవారం 2.46 శాతం లాభంతో రూ.2,950 వద్ద ముగిశాయి. రూ.3,250 టార్గెట్‌తో మదుపరులు ఈ కౌంటర్లో రూ.2,940/2,920 శ్రేణిలో పొజిషన్లు తీసుకోవచ్చు. అయి తే రూ.2,880ను గట్టి స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
అపోలో టైర్స్: ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు కన్సాలిడేషన్ ఆఖరి దశలో ఉన్నాయి. మరోసారి జీవితకాల గరిష్ఠ స్థాయివైపు పయనిస్తున్నాయి. సరఫరా తక్కువగా ఉండ డంతో డిమాండ్ పెరుగుతోంది. శుక్రవారం రూ.526 వద్ద ముగిశాయి. మదుపరులు రూ.570 టార్గెట్‌తో రూ.520/500 శ్రేణిలో ఈ కౌంటర్లో పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.480ను కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.