కోటక్ షేరు కుంగదీసెన్..
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:48 AM
ప్రామాణిక ఈక్విటీ సూచీలు ఆరంభ లాభాలను నిలుపుకోలేకపోయాయి. సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 545 పాయింట్ల వరకు పుంజుకున్న సెన్సెక్స్.. తొలి గంటలోనే నష్టాల్లోకి మళ్లింది. ఒక దశలో 81,000 స్థాయిని కూడా...
సెన్సెక్స్ 73 పాయింట్లు డౌన్
ముంబై: ప్రామాణిక ఈక్విటీ సూచీలు ఆరంభ లాభాలను నిలుపుకోలేకపోయాయి. సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 545 పాయింట్ల వరకు పుంజుకున్న సెన్సెక్స్.. తొలి గంటలోనే నష్టాల్లోకి మళ్లింది. ఒక దశలో 81,000 స్థాయిని కూడా కోల్పోయిన సూచీ మళ్లీ తేరుకుని, చివరికి 73.48 పాయింట్ల నష్టంతో 81,151.27 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 72.95 పాయింట్లు నష్టపోయి 24,781.10 వద్ద ముగిసింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లలో భారీగా అమ్మకాలతోపాటు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తరలిపోవడం మార్కెట్‌ను కుంగదీసింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 21 నష్టపోగా.. నిరాశాజనక త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన కోటక్ బ్యాంక్ షేరు ఏకంగా 4.29 శాతం క్షీణించి సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది. బీఎ్‌సఈలోని మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలైతే 1.63 శాతం వరకు నష్టపోయాయి.