Share News

బ్యాంక్‌ ఖాతాకు నలుగురు నామినీలు

ABN , Publish Date - Aug 10 , 2024 | 06:05 AM

ప్రస్తుతం ఒక వ్యక్తి తన బ్యాంక్‌ ఖాతాకు ఒక నామినీని మాత్రమే ఎంచుకునే వీలుంది. త్వరలో ఖాతాదారు తన అకౌంట్‌కు గరిష్ఠంగా నలుగురిని నామినీలుగా ఎంచుకునే వెసులుబాటు లభించనుంది. ఇందుకు వీలు కల్పించే ‘బ్యాంకింగ్‌ నిబంధనల (సవరణ) బిల్లు, 2024’ను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

బ్యాంక్‌ ఖాతాకు  నలుగురు నామినీలు

ఖాతాదారులకు మరింత వెసులుబాటు

బ్యాంకింగ్‌ నిబంధనల సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఒక వ్యక్తి తన బ్యాంక్‌ ఖాతాకు ఒక నామినీని మాత్రమే ఎంచుకునే వీలుంది. త్వరలో ఖాతాదారు తన అకౌంట్‌కు గరిష్ఠంగా నలుగురిని నామినీలుగా ఎంచుకునే వెసులుబాటు లభించనుంది. ఇందుకు వీలు కల్పించే ‘బ్యాంకింగ్‌ నిబంధనల (సవరణ) బిల్లు, 2024’ను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు బ్యాంక్‌ అకౌంట్లు, లాకర్ల ఖాతాకు ఏకకాలంలో, వరుసగా నలుగురి పేర్లను నామినీలుగా చేర్చే సదుపాయం కల్పిస్తుంది. దురదృష్టవశాత్తూ బ్యాం క్‌ ఖాతాదారు మరణిస్తే, తన అకౌంట్‌లోని సొమ్ము లేదా లాకర్‌లోని వస్తువులు నామినీకి చెందుతా యి. అయితే, నామినీ వాటిని బ్యాంక్‌ నుంచి క్లెయి మ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. గత వారమే కేంద్ర కేబినెట్‌ ఆమోదం పొందిన బ్యాంకింగ్‌ నిబంధనల సవరణ బిల్లులో ప్రతిపాదించిన మరిన్ని అంశాలు..

  • క్లెయిమ్‌ చేయని డివిడెండ్లు, షేర్లు, బాండ్లను ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌ (ఐఈపీఎ్‌ఫ)కు బదిలీ చేసే అధికారం కల్పించడంతోపాటు వ్యక్తులు ఆ ఫండ్‌ నుంచి తమ సొమ్ముని తిరిగి క్లెయిమ్‌ చేసుకునేందుకు అనుమతించాలని బిల్లు ప్రతిపాదించింది.

  • డైరెక్టర్‌షి్‌పకు సబ్‌స్టాన్షియల్‌ ఇంట్రెస్ట్‌ పరిమితిని ఆరు దశాబ్దాల క్రితం నిర్దేశించిన రూ.5 లక్షల స్థాయి నుంచి రూ.2 కోట్లకు పెంచాలని బిల్లు ప్రతిపాదించింది.

  • బ్యాంక్‌లు తమ ఆడిటర్లకు చెల్లించే పారితోషికంపై మరింత స్వేచ్ఛ కల్పించాలని బిల్లు ప్రతిపాదించింది. అలాగే, నియంత్రణ నియమాళికి లోబడి బ్యాంక్‌ల రిపోర్టింగ్‌ తేదీలను ప్రస్తుతం పాటిస్తున్న రెండు, నాలుగో శుక్రవారాలకు బదులు ప్రతినెలా 15వ తేదీతో పాటు నెల చివరి రోజుకు మార్చాలని బిల్లు ప్రతిపాదించింది.

  • సహకార బ్యాంక్‌ల్లో చైర్మన్‌, పర్మినెంట్‌ డైరెక్టర్లు మినహా మిగతా డైరెక్టర్ల పదవీకాలాన్ని 8 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పొడిగించాలని బిల్లు ప్రతిపాదించింది.

  • రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం 1934, బ్యాంకింగ్‌ నియమాళి చట్టం 1949, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం 1955, బ్యాంకింగ్‌ కంపెనీ్‌స (అక్విజిషన్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌) చట్టం 1970, బ్యాంకింగ్‌ కంపెనీ్‌స (అక్విజిషన్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌) చట్టం 1980లను సవరించాలని కూడా బిల్లు ప్రతిపాదించింది.

భారతీయ వాయుయాన్‌ విధాయక్‌ బిల్లుకు ఆమోదం

దేశంలో విమానయాన రంగ అభివృద్ధి మరింత పుంజుకోనుంది. ఇందుకు దోహదం చేసే ‘భారతీయ వాయుయాన్‌ విధాయక్‌ బిల్లు’కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. 1934 నాటికి ఎయిర్‌క్రాఫ్ట్‌ చట్టం స్థానంలో ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చింది. దీంతో దేశంలో పౌర విమానయాన వ్యాపారం మరింత సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ఈ బిల్లును ప్రవేశపెడుతూ దేశంలో విమాన చార్జీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు చెప్పారు.

Updated Date - Aug 10 , 2024 | 06:05 AM