Share News

భారత మార్కెట్లోకి ఈఎల్‌ అండ్‌ ఎన్‌ లండన్‌

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:30 AM

అంతర్జాతీయ లైఫ్‌స్టైల్‌, కేఫ్‌ బ్రాండ్‌ ఈఎల్‌ అండ్‌ ఎన్‌ లండన్‌.. భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ బ్రాండ్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌బీఎల్‌)తో కలిసి తొలి స్టోర్‌ను ముంబైలో...

భారత మార్కెట్లోకి ఈఎల్‌ అండ్‌ ఎన్‌ లండన్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ లైఫ్‌స్టైల్‌, కేఫ్‌ బ్రాండ్‌ ఈఎల్‌ అండ్‌ ఎన్‌ లండన్‌.. భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ బ్రాండ్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌బీఎల్‌)తో కలిసి తొలి స్టోర్‌ను ముంబైలో ప్రారంభించింది. భారతీయ కుటుంబాలకు సరికొత్త స్టైల్స్‌ను అందుబాటులోకి తీసుకురావటంతో పాటు కాఫీ ప్రియుల కోసం ప్రత్యేకమైన అనుభవాన్ని అందించేందుకు దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టినట్లు ఈఎల్‌ అండ్‌ ఎన్‌ లండన్‌ వెల్లడించింది. ఫుడ్‌ అండ్‌ బెవరేజేస్‌ విభాగంలో స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు ఈఎల్‌ అండ్‌ ఎన్‌తో భాగస్వామ్యం ఎంతగానో తోడ్పడనుందని ఆర్‌బీఎల్‌ మాతృసంస్థ రిలయన్స్‌ రిటైల్‌ తెలిపింది.

Updated Date - Oct 20 , 2024 | 12:30 AM