Share News

భారత్‌ బయోటెక్‌ నుంచి ‘ఏవీ0328’ వ్యాక్సిన్‌

ABN , Publish Date - Sep 12 , 2024 | 02:56 AM

భారత్‌ బయోటెక్‌ కంపెనీ మరో సరికొత్త వ్యాక్సిన్‌ తయారీకి సిద్ధమైంది. యాంటీ బ్యాక్టీరియల్‌ వ్యాక్సిన్‌ ‘ఏవీ0328’ అభివృద్ధి, వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి కోసం అమెరికన్‌ కంపెనీ అలోపెక్స్‌.ఇంక్‌తో...

భారత్‌ బయోటెక్‌ నుంచి ‘ఏవీ0328’ వ్యాక్సిన్‌

హైదరాబాద్‌: భారత్‌ బయోటెక్‌ కంపెనీ మరో సరికొత్త వ్యాక్సిన్‌ తయారీకి సిద్ధమైంది. యాంటీ బ్యాక్టీరియల్‌ వ్యాక్సిన్‌ ‘ఏవీ0328’ అభివృద్ధి, వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి కోసం అమెరికన్‌ కంపెనీ అలోపెక్స్‌.ఇంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యాక్సిన్‌ను మన దేశంతో పాటు నిరుపేద, దిగుమ మధ్యాదాయ దేశాల్లో మార్కెట్‌ చేస్తుంది. ఇందుకు అలోపెక్స్‌ కంపెనీకి కొంత మొత్తంలో ఏకకాల ఫీజు చెల్లిస్తుంది. దీంతో పాటు అమ్మకాలపై రాయల్టీ, అమ్మకాలు నిర్ణీత స్థాయికి చేరినపుడల్లా ప్రత్యేక చెల్లింపులు చేస్తుంది. ‘వ్యాక్సినేషన్‌ ద్వారా యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ను తగ్గించే పరిష్కారాలను అభివృద్ధి చేయడం మా లక్ష్యం. ఇందుకోసమే ‘ఏవీ0328’ వ్యాక్సిన్‌ కోసం అలోపెక్స్‌ కంపెనీతో చేతులు కలిపాం. ఇందుకు చాలా గర్వంగా ఉంది’ అని భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్లా ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Sep 12 , 2024 | 02:56 AM