తెలంగాణలో 55 వేల మంది విక్రేతలు
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:59 AM
ఈ ఏడాది పండగల సీజన్‌లో చిన్న, మధ్య తరహా వ్యాపారుల (ఎస్‌ఎంబీ)కు తోడ్పాటునందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అమెజాన్ ఇండియా...
అమెజాన్ ఇండియా
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఈ ఏడాది పండగల సీజన్‌లో చిన్న, మధ్య తరహా వ్యాపారుల (ఎస్‌ఎంబీ)కు తోడ్పాటునందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అమెజాన్ ఇండియా డైరెక్టర్ (సేల్స్) గౌరవ్ మాథుర్ వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి 55,000 మంది విక్రేతలు తమ ప్లాట్‌ఫామ్ ద్వారా తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారన్నారు. గత ఏడాది పండగల సీజన్‌లో విక్రేతల సంఖ్య 44,000గా ఉందని ఆయన తెలిపారు. వీరికి మరింత తోడ్పాటునందించే ఉద్దేశంతో అమ్మకం ఫీజును 3 నుంచి 12 శాతం వరకు తగ్గించినట్లు ఆయన పేర్కొన్నారు.