Share News

2026 నాటికి రూ.100 కోట్ల టర్నోవర్‌

ABN , Publish Date - Oct 02 , 2024 | 01:02 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఐస్‌బర్గ్‌ ఆర్గానిక్‌ ఐస్‌ క్రీమ్స్‌.. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.100 కోట్ల టర్నోవర్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది...

2026 నాటికి రూ.100 కోట్ల టర్నోవర్‌

ఐస్‌బర్గ్‌ ఆర్గానిక్‌ ఐస్‌క్రీమ్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఐస్‌బర్గ్‌ ఆర్గానిక్‌ ఐస్‌ క్రీమ్స్‌.. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.100 కోట్ల టర్నోవర్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మంగళవారం నాడిక్కడ మార్కెట్లోకి ప్రీమియం బ్రాండ్‌ ‘ఆర్గానిక్‌ క్రీమరీ’ని విడుదల చేసిన సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు, ఆర్‌ఎస్‌ బిజినెస్‌ వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ సీఈఓ సుహాస్‌ బీ శెట్టి మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.14 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసిందని, కార్యకలాపాల విస్తరణ ద్వారా నిర్దేశిత లక్ష్యాన్ని అందుకోవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఐస్‌బర్గ్‌.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా ఏడు రాష్ట్రాల్లో మొత్తం 72 విక్రయ కేంద్రాలను నిర్వహిస్తోందన్నారు. విస్తరణలో భాగంగా వచ్చే రెండేళ్లలో కొత్తగా రూ.11 కోట్ల పెట్టుబడితో 25 ఔట్‌లెట్స్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు.


ఇందులో భాగంగా ఈ నెల 12న హైదరాబాద్‌లో 73వ ఔట్‌లెట్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో రూ.40 కోట్లతో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో కంపెనీ 36 ఫ్లేవర్స్‌తో కూడిన ఆర్గానిక్‌ ఐస్‌క్రీమ్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 12,500 లీటర్లుగా ఉంది.

Updated Date - Oct 02 , 2024 | 01:02 AM