Share News

అమరావతిపై వైసీపీ దుష్ప్రచారం

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:03 AM

వరదకు, వర్షపు నీరు నిల్వ ఉండటానికి తేడా ఉంది. రాజధాని అమరావతిలో చాలా వరకు ఖాళీ భూములు ఉన్నాయి. భారీ వర్షాలు కురిసినపుడు పొలాల్లో నీరు నిల్వడం సహజం.

అమరావతిపై వైసీపీ దుష్ప్రచారం

ఒక్క గ్రామంలోనూ వరద ముంపు లేదు

హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో ఎక్కడా నీరు లేదు

బహుజన జేఏసీ అధ్యక్షుడు బాలకోటయ్య

తుళ్లూరు, సెప్టెంబరు 4: వరదకు, వర్షపు నీరు నిల్వ ఉండటానికి తేడా ఉంది. రాజధాని అమరావతిలో చాలా వరకు ఖాళీ భూములు ఉన్నాయి. భారీ వర్షాలు కురిసినపుడు పొలాల్లో నీరు నిల్వడం సహజం. పొలాల్లో నిలిచిన నీటిని వరదగా పేర్కొంటూ, రాజధానిలో పలు గ్రామాలను వరద ముంచిందంటూ వైసీపీ ప్రచారం చేయడాన్ని స్థానిక రైతులు తప్పుపడుతున్నారు. రాజధానికి భూములిచ్చిన ఏ ఒక్క గ్రామం కూడా వరదకు కానీ, ముంపునకు కానీ గురికాలేదని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అన్నారు. బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ... అమరావతిలో హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో ఎక్కడా నీరు లేకపోయినా వైసీపీ సోషల్‌ మీడియా పనికట్టుకుని దుష్ప్రచారం చే స్తోందని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిపై విషం కక్కి రైతులను ఇబ్బందులు పెట్టిన మాజీ సీఎం జగన్‌రెడ్డి అండ్‌కోకు ఇంకా బుద్ధి మారలేదని ఎద్దేవా చేశారు. ఐదు కోట్ల మంది కోరుకునే అమరావతి రాజధానిపై ఇంకా బురదజల్లే ప్రయత్నం వైసీపీ చేయటం దుర్మార్గమన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్‌ పార్టీకి ప్రజలు ఎన్నికల్లో కేవలం 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా ఇంకా ఆ పార్టీ నేతలు తె లుసుకోకపోవటం శోచనీయమని విమర్శించారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు, వరదలకు ఇబ్బందులు పడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయని, అమరావతికి వరద నీరు వ స్తే ఆశ్చర్యం ఏముందని ప్రశ్నించారు. పదే పదే అమరావతి మునిగిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లు మునిగిందంటూ వైసీపీ దుష్ప్రచారానికి పరిమితమైంది తప్ప.. లక్షాలాది నిర్వాసితులను ఆదుకోవటంలో విఫలమైందన్నారు. గత నాలుగు రోజలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు మోకాళ్ల లోతు నీళ్లలో నడుస్తూ, జే సీబీపై ప్రయాణిస్తూ బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారని, అయితే వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడా కనిపించటం లేదని విమర్శించారు. మాజీ సీఎం జగన్‌రెడ్డి కూడా కెమెరా, యాక్షన్‌ అన్నట్టు కాసేపు నటించి వెళ్లిపోయారన్నారు. బుడమేరుకు, కృష్ణా నదికి ఎలాంటి సంబంధం లేదని, బుడమేరు ఎక్కడ ఉందో జగన్‌కు తెలియదని, బుడమేరు వాగును నదిగా పోల్చటంతోనే జగన్‌రెడ్డి అవగాహనా రాహిత్యం అర్థం అవుతుందన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 07:16 AM