ఐదు రోజుల తర్వాత ఇప్పుడు వస్తారా?
ABN , Publish Date - Sep 05 , 2024 | 03:52 AM
విజయవాడ రాజరాజేశ్వరిపేటలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది.
బొత్సను నిలదీసిన బాధితులు
విజయవాడ రాజరాజేశ్వరిపేటలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. తాము ఐదు రోజులుగా బాధపడుతుంటే ఇప్పుడొస్తారా అంటూ బాధితులు ఆవేశంతో బొత్సను ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం రాజరాజేశ్వరిపేటలో ఆయనను చూడగానే బాధిత మహిళలు చుట్టుముట్టారు. ఆగ్రహ,ఆక్రోశాలను వెళ్లగక్కారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం కూడా దక్కకుండా చేసేందుకు వచ్చారా అంటూ అసహనం వ్యక్తంచేశారు. మీరేం సాయం చేస్తున్నారంటూ నిలేశారు. మహిళల అనూహ్య నిరసనలతో బొత్స, ఆయన వెంటఉన్నవారు ఖిన్నులయ్యారు. తాము అధికారంలో లేమని సణుక్కుంటూ బొత్స వెనుదిరిగారు.