సరదాగా చెరువులో స్నానానికి దిగి..
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:26 AM
సరదాగా చెరువులో స్నానానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది.
కైకలూరు, అక్టోబరు 1: సరదాగా చెరువులో స్నానానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. కైకలూ రుకు చెందిన గోపాలపురపు త్రినాథ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు నారాయణ (19) ఇంటర్ వరకు చదివి ఖాళీగా ఉంటున్నాడు. మంగళవారం స్నేహితులతో కలసి మండలంలోని గోపవరం గ్రామానికి వెళ్లి ఓఎన్జీసీ రోడ్డులోని రజకుల చెరువులో స్నానానికి దిగాడు. చెరువు లోతుగా ఉండడంతో నారాయణ నీట మునుగుతూ బిగ్గరగా కేకలు వేయగా అప్పటికే చెరువులో దిగుతున్న గుణ అనే యువకుడు కాపాడేందుకు యత్నిం చాడు. అతను కూడా మునిగి పోతుండగా స్థానికులు కాపాడారు. నారాయ ణ కోసం గాలించి వెలికితీయగా అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. గుణను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కైకలూరు టౌన్ సీఐ పి. కృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని నారాయణ మృతదేహాన్ని కైకలూరు ప్రభుత్వా సుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.