Share News

కొప్పాకలో భయం.. భయం..

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:27 AM

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గ్రామాల్లో అధికార వైసీపీ నేతలు దాడుల సంస్కృతికి తెరతీశారు. ఏదో చిన్నసాకుతో టీడీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారు.

కొప్పాకలో భయం.. భయం..
వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే కొఠారు

వారు మాపైనా దాడి చేశారంటూ ఎదురుకేసు

గాయపడిన వారంతా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స.. టీడీపీ వారికి ఎందుకు చికిత్స చేస్తున్నారని సిబ్బందిపై ఎమ్మెల్యే అబ్బయ్య మండిపాటు

తమ పార్టీ వారినే చేర్చుకోవాలని హుకుం జారీ

ఓటమి భయంతోనే వైసీపీ దాడులు : చింతమనేని

ఎన్నికల ముంగిట రాజకీయ వేడి.. పోలీసు పికెట్‌ ఏర్పాటు

పెదవేగి/ఏలూరు క్రైం, ఫిబ్రవరి 12 :

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గ్రామాల్లో అధికార వైసీపీ నేతలు దాడుల సంస్కృతికి తెరతీశారు. ఏదో చిన్నసాకుతో టీడీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారు. పెదవేగి మండలం కొప్పాకలో ఆదివారం రాత్రి వైసీపీ శ్రేణులు టీడీపీ నాయకుల ఇళ్ళపై పడి విధ్వంసం సృష్టించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కాటేపల్లి సాంబశివరావుతోపాటు మరో ముగ్గురు ఏలూరు సర్వజన ఆస్పత్రిలో చేరారు. మరోవైపు వైసీపీ నాయకులు శబరీనాధ్‌, రంగారావు తమపై టీడీపీ నాయకులు దాడి చేశారంటూ అదే ఆస్పత్రిలో చేరారు. ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినట్టు పెదవేగి ఎస్‌ఐ వి.రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశామని చెప్పారు.

దెందులూరు నియోజక వర్గంలో మునుపెన్నడూ లేని రీతిలో అధికార వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకులపై దాడుల విష సంస్కృతికి తెరతీశారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని కొప్పాకలో ఆదివారం రాత్రి వైసీపీకి చెందిన కొంతమంది నేతలు టీడీపీ నేతల ఇంటిపైకి దాడికి దిగారు. సంక్రాంతి కోడిపందేల విషయంలో ఏర్పడిన వివాదం ఒక కారణమైతే శనివారం రాత్రి జానంపేట దగ్గర పోలవరం కుడి కాల్వ గట్టు మట్టిని అక్రమంగా తరలిస్తున్న సమాచారంతో ఏలూరు ఆర్డీవో ఎన్‌ఎస్కే. ఖాజావలి దాడి చేసి, మట్టిని తరలిస్తున్న టిప్పర్లను స్వాధీనం చేసు కుని, పెదవేగి తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. ఈ దాడి వెనుక కొప్పాకకు చెందిన టీడీపీ నాయకులు కాటేపల్లి సాంబశివరావు, సత్య వర్థన్‌లు ఉన్నారని భావించిన వైసీపీ నాయకులు రంగారావు, పోతురాజు, వెంకన్న తదితరులు తమ అనుచరగణంతో సాంబశివరావు, సత్యవర్థన్ల ఇళ్లపై దాడికి తెగబడ్డారు. అడ్డుపడిన సాంబశివరావు కుటుంబీకులపై కూడా దాడికి తెగబడ్డారు. పోలీసుల రాకతో వివాదం సర్దుమణిగిన గ్రామంలో నివురుగప్పిన నిప్పులా రాసుకుంటూనే ఉంది. ముందస్తు చర్యగా పోలీసులు గ్రామంలో పికెట్‌ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఏ క్షణంలో ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. మేము అధికారంలో ఉన్నాం. మేము ఏం చెప్పినా.. ఏం చేసినా చెల్లు బాటవుతుంది. ప్రతిపక్షంలో ఉన్న మీరు, మేము చేసే పనులను చూస్తూ ఉండాల్సిందే తప్ప మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. ప్రశ్నిస్తే ఫలితం ఇలాగే ఉంటుంది.. అంటూ వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని బాధిత టీడీపీ వర్గీయులు పేర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నికల వేళ రానున్న రోజుల్లో మరిన్ని దాడులు జరిగే ప్రమాదం లేకపోలేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతలు చేస్తున్న మట్టి గ్రావెల్‌ అక్రమాలను ప్రతిపక్ష టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో మట్టి మాఫియా అధికారి పార్టీ నేతల సహకారంతో దాడులకు దిగుతున్నారు. గత నెల 30వ తేదీ పెదవేగి మండలం లక్ష్మీపురం పరిధిలో పోలవరం కుడి కాల్వ గట్టు నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్న సమాచారంతో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, మట్టి తరలిస్తున్న టిప్పర్లను పట్టుకుని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందిం చారు. ఇంతలో అక్కడికి చేరుకున్న వైసీపీ శ్రేణులు, పోలీసుల సమక్షంలోనే టీడీపీ నాయకులపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో ఇద్దరు టీడీపీ నాయకులకు తీవ్ర గాయాల య్యాయి. వైసీపీ చేస్తున్న అక్రమాలను ప్రశ్నించినందుకే ఇలా దాడులు చేస్తున్నారా.. అంటూ ప్రజానీకం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా కొప్పాకలో ఆదివారం రాత్రి వైసీపీ మూకల దాడిలో గాయ పడిన టీడీపీకి చెందిన కాటేపల్లి సాంబశివరావుతోపాటు మరో ముగ్గు రు ఏలూరు సర్వజన ఆస్పత్రిలో చేరారు. మరో వైపు వైసీపీ నాయకులు శబరీనాథ్‌, రంగారావు అనే ఇద్దరు తమపై టీడీపీ నాయకులు దాడి చేశారంటూ అదే ఆస్పత్రిలో చేరారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి తన వర్గీయులను పరామర్శించడానికి ఆస్పత్రికి వెళ్లి అక్కడి అధికారులపై ఆగ్రహంతో చిందులు వేశారు. తమ వాళ్లను మాత్రమే ఆస్పత్రిలో చేర్చు కోవాలని, తమ వారిపై దాడులు చేసి ఆస్పత్రికి వస్తే ఎందుకు చేర్చుకు న్నారంటూ వైద్యులను ప్రశ్నించారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నాయకుడు శివరామ్‌ప్రసాద్‌ను పరామర్శించ డానికి ఆస్పత్రికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ మీడియాతో మాట్లా డుతుండగా అదే సమయంలో ఆస్పత్రికి వచ్చిన వైసీపీ నాయకుడు, జడ్పీ చైర్మన్‌ భర్త ఘంటా ప్రసాద్‌ ‘ఇదేమైనా తెలుగుదేశం పార్టీ కార్యాలయమా’ అంటూ అధికారులపై, ఆసుపత్రి సిబ్బందిపై చిందులు తొక్కారు. పరుష పదజాలంతో దుర్భా షలాడడంతో తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసుల సహకారంతో ఆస్పత్రి గేట్లు మూయించి లోపల ఉండి మరీ బూతుల పురాణం అందుకున్నారు. గేటు వద్ద ఒకవైపు ఏలూరు త్రీ టౌన్‌ సీఐ వెంకటేశ్వ రరావు, మరోవైపు డిస్ట్రిక్ట్‌ గార్డు పోలీసులు కాపలాగా ఉన్నారు. వారి సమక్షంలో అసభ్య పదజాలంతో ప్రసాద్‌ ఒకవైపు ఆస్పత్రి సిబ్బందితో పాటు టీడీపీ కార్యకర్తలపై, నాయకులపై విరు చుకుపడ్డారు. చివరకు అక్కడే హెల్ప్‌ డెస్క్‌లో ఉన్న ఆస్పత్రి ఉద్యోగి (అంధుడు) ‘ఇది ఆస్పత్రి. రోగులు ఉంటారు. జాగ్రత్తగా మాట్లాడండి’ అంటూ గట్టిగా చెప్పడం గమనార్హం. చివరకు పోలీసులు ఆందోళనకు దిగిన తెలుగు దేశం కార్య కర్తలను, నాయకులు సమన్వయం పాటించాలంటూ అక్కడ నుంచి పంపించివేశారు. వాస్తవానికి ఆస్పత్రిలో వైద్యం పొందడానికి ఎవరి కైనా హక్కు ఉంది. ఎలాంటి బేధాలు లేకుండా ఎలాంటి వారైనా ప్రాణాపాయస్థితిలో ఉన్నారంటే ప్రాణాలు కాపాడడానికి వైద్యులు అహర్నిశలు కష్టపడుతుంటారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాత్రం కొత్త రూల్‌ తెవ్వడం గమనార్హం. మరోవైపు వైద్యులు సమన్వయంతో వైద్య సేవలందించడం తమ బాధ్యతని సమాధానమిచ్చారు.

ఓటమి భయంతోనే అల్లర్లు : చింతమనేని

వైసీపీ కార్యకర్తల దాడిలో గాయాలకు గురైన సాంబశివ రావు, ఆయన అన్న కోడలు ఐశ్వర్యలను చింతమనేని తన అనుచరగణంతో ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. ఈ సంద ర్భంగా చింతమనేని మీడియాతో మాట్లాడుతూ.. ‘దెందులూ రులో అరాచకపు పాలన, దుర్మార్గపు పాలన కొనసాగుతోంది. ఓటమి అంచున వున్న వారు భయంతో ఏవో అల్లర్లు సృష్టించా లని, టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇసుక, మట్టిని మింగేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై పగపట్టి కేసులు పెడుతూ దాడులు చేస్తున్నారు. ఈ పరిస్థితులన్ని నియోజక వర్గ ప్రజలు గమనిస్తున్నారు. వారిని ఇంటికి పంపించడానికి ఓటర్లు అంతా సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి దాడులను ఖండి స్తున్నాం’ అని పేర్కొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:27 AM