Share News

అండగా మేమున్నాం

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:10 AM

గోదావరి నదికి తిరిగి వరద పెరుగుతుందని బాగా పెరిగే వరకు చూడకుండా ముందుగానే గ్రామాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, మండల ప్రత్యేకాధికారి, డ్వామా పీడీ ఏ.రాము ప్రజలకు సూచించారు.

అండగా మేమున్నాం
తాళ్లమూడి, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌

ఎమ్మెల్యేలు బాలరాజు, ప్రభాకర్‌

వేలేరుపాడు, సెప్టెంబరు 4: గోదావరి నదికి తిరిగి వరద పెరుగుతుందని బాగా పెరిగే వరకు చూడకుండా ముందుగానే గ్రామాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, మండల ప్రత్యేకాధికారి, డ్వామా పీడీ ఏ.రాము ప్రజలకు సూచించారు. ఎమ్మెల్యే, అధికారుల బృందం మండలంలోని అత్యంత మారుమూల గ్రామా లైన అటుకూరు, కోయిద, పేరాంటాళ్ళపల్లి, టేకుపల్లి గ్రామాలకు బుధవారం బోటులో వెళ్లి ప్రజలు సూచించారు. బుధవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుందని ఇది మరింతా పెరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే అన్నారు. మండల ప్రత్యేకాధి కారి, డ్వామా పీడీ ఎ.రాము మాట్లాడుతూ గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక సమయానికి వేలేరుపాడు మండలంలోని వరద ప్రభావిత 15 గ్రామాల్లోనే 943 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామన్నా రు. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు నూనె, పంచదార, బంగాళ దుంపలు, ఉల్లిపాయలు, ఒక్కొక్క కిలో చొప్పున అఽందిం చామని అన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా అధికారులంతా అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే, అధికారులు గ్రామస్థులకు భరోసా ఇచ్చారు. ఈ పర్యట నలో జంగారెడ్డిగూడెం ఆర్‌డీఓ కె.అద్దయ్య, ఆర్‌ఎస్‌ఎస్‌ రాజు, వేలేరుపాడు, కొయ్యలగూడెం తహసీల్దార్‌లు పీవీ సత్యనారాయణ, చల్లన్నదొర, డీఎల్‌పీఓ రజవుల్లా, ఎంపీడీఓ మూర్తి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

726 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

పెదపాడు, సెప్టెంబరు 4 : వరదలకు నష్టపోయిన ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. పెదపాడు మండలం తాళ్లమూడిలో 500 మంది వరద బాధిత కుటుంబాలకు బుధవారం 25 కేజీల బియ్యం, మంచినూనె, కందిపప్పు, నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వల్లే ఈనాటి దుస్థితి ఏర్పడిందని, డ్రెయిన్లు, కాలువలు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల గ్రామాలన్నీ ముంపునకు గురయ్యాయన్నారు. మండల పరిధిలో ముంపునకు గురైన మొత్తం 726 కుటుంబాలకు కూడా నిత్యవసర సరు కులు అందజేస్తామని ప్రభాకర్‌ తెలిపారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు, వరద బాధితులు పాల్గొన్నారు

Updated Date - Sep 05 , 2024 | 12:10 AM