Share News

ఇంజనీర్లు దేశ భవిష్యత్తు రూపశిల్పులు

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:37 AM

ఇంజనీర్లు దేశానికి రూప శిల్పులని ఏపీ నిట్‌ డీన్‌ స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ డాక్టర్‌ జీబీ వీరేష్‌కుమార్‌ అన్నారు. నిట్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ బీఎస్‌ మూర్తి ఆధ్వర్యంలో, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పి.దినేష్‌ శంకర్‌రెడ్డి పర్యవేక్షణలో నిట్‌ ప్రాంగణంలో ఆదివారం ఘనంగా ఇంజనీర్స్‌ దినోత్సవం నిర్వహించారు.

ఇంజనీర్లు దేశ భవిష్యత్తు రూపశిల్పులు
విశ్వేశ్వరయ్య చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నిట్‌ ఆచార్యులు, విద్యార్థులు

మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు

తాడేపల్లిగూడెం అర్బన్‌, సెప్టెంబరు 15 : ఇంజనీర్లు దేశానికి రూప శిల్పులని ఏపీ నిట్‌ డీన్‌ స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ డాక్టర్‌ జీబీ వీరేష్‌కుమార్‌ అన్నారు. నిట్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ బీఎస్‌ మూర్తి ఆధ్వర్యంలో, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పి.దినేష్‌ శంకర్‌రెడ్డి పర్యవేక్షణలో నిట్‌ ప్రాంగణంలో ఆదివారం ఘనంగా ఇంజనీర్స్‌ దినోత్సవం నిర్వహించారు. ఆచార్యులు డాక్టర్‌ వీ.సందీప్‌, సాస్‌ అసిస్టెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

భీమవరం అర్బన్‌/భీమవరం క్రైం, సెప్టెంబరు 15 : భారతదేశ ఇంజనీరింగ్‌ వ్యవస్థలో మొట్టమొదటి ఇంజనీర్‌గా ఎన్నో నీటి ప్రాజెక్టులు నిర్మించిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని భీమవరం సిటిజన్‌ పోరం అధ్యక్షుడు బొండా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం ఇంజనీర్స్‌ డే సందర్భంగా విశ్వేశ్వరయ్య జయంతిని విజ్ఞాన వేదిక సంస్థ అధ్యక్షుడు అల్లు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అరసవల్లి ఈశ్వరమ్మ వీర వెంకటాచారి చారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. భీమవరం రైల్వే జంక్షన్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో డాక్టర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి, ఇంజనీర్స్‌డే కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీవిజ్ఞాన వేదిక, హౌసింగ్‌ బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రైల్వే డివిజనల్‌ ఇంజనీర్‌ అందే శంకర్‌ రామాంజనేయులు మాట్లాడారు. భీమవరం రైల్వే ఇంజనీర్‌ వై.రాంబాబు, కె.మనోహర్‌, మోహన్‌, సయ్యపురాజు సూర్యనారాయణరాజు మాట్లాడారు. అనంతరం ఆరుగురు ఇంజనీర్లను ఘనంగా సత్కరించారు. శ్రీచెరుకువాడ రంగసాయి, హౌసింగ్‌బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ చైౖర్మన్‌ సరిపిడకల రామారావు, కంతేటి వెంకటరాజు, కె.బాల పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:37 AM