దేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:42 AM
దేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితం స్ఫూర్తిదాయకమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
ఇంజనీర్లను సత్కరించిన మంత్రి నిమ్మల
పాలకొల్లు టౌన్, సెప్టెంబరు 15: దేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితం స్ఫూర్తిదాయకమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మోక్షగుం డం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా పాలకొల్లు జల వనరులశాఖ ఇంజనీరింగ్ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఇంజనీరింగ్ డే వేడుకల్లో మంత్రి నిమ్మల ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు. విశ్వేశ్వరయ్య చిత్రపటానికి నిమ్మల రామానాయుడు, అంగర రామ్మోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉద్యోగ విరమణ చేసిన, సీనియర్ ఇంజనీర్లను మంత్రి రామానాయుడు సత్కరించారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య, కె.ఎల్.రావు, కాటన్, శివరామకృష్ణయ్య వంటి మహనీయుల జయంతిని కూడా గత ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు. ఆ మహనీ యుల ఆత్మలు క్షోభించేలా జగన్ పాలనలో ఇరిగేషన్ ప్రాజె క్టులు, సాగునీటి వ్యవస్థలు విధ్వంసానికి గురయ్యాయని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బుడమేరకు రూ.40 కోట్లు కేటాయించి 80శాతం పనులు పూర్తిచేశామని గత ప్రభుత్వం బుడమేరును గాలికొదిలేసిందన్నారు. కార్యక్రమం లో జల వనరుల శాఖ ఎస్‌ఈ దేవప్రకాష్, ఈఈ దక్షిణా మూర్తి, ఎన్డీఏ నాయకులు పెచ్చెట్టి బాబు, జీవీ, మామిడిశెట్టి పెద్దిరాజు, ఉన్నమట్ల కబర్థి, కోడి విజయభాస్కర్, కర్నేని గౌరునాయుడు, జక్కంపూడి కుమార్, ఆరుమిల్లి రామ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.