కేపీపాలెం జ్యూయలరీ షాపులో భారీ చోరీ
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:53 AM
నరసాపురం మండలం తూర్పుతాళ్ళు, మొగల్తూరు మండలం కేపీపాలెం సరిహద్దునున్న దుర్గా జ్యూయలరీలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. సుమారు రూ.40 లక్షలు విలువ చేసే బంగారు వస్తువులను దుండగులు అపహరించుకుపోయారు.
రూ.40 లక్షలు విలువ చేసే బంగారం అపహరణ
పట్టుకెళ్లని వెండి వస్తువులు..పోయిందంతా తాకట్టు బంగారమే
నరసాపురం/మొగల్తూరు, సెప్టెంబరు 15: నరసాపురం మండలం తూర్పుతాళ్ళు, మొగల్తూరు మండలం కేపీపాలెం సరిహద్దునున్న దుర్గా జ్యూయలరీలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. సుమారు రూ.40 లక్షలు విలువ చేసే బంగారు వస్తువులను దుండగులు అపహరించుకుపోయారు. వెండి వస్తువులను ముట్టుకోలేదు. చోరీకి గురైన వస్తువులన్నీ తాకట్టు బంగా రమే. శనివారం ఇదే మండలంలోని రామన్నపాలెంలో ఓ ఇంట్లో చోరీ జరిగిన కొన్ని గంటలకే మరో భారీ దొంగతనం వెలుగుచూడటం తీరంలో చర్చనీయాంశమైంది. రామన్నపాలెంలో జరిగిన చోరీలో దుండగులు సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌ను ఎత్తికేళ్లారు. అదే తరహాలో ఈ బంగారం దుకా ణంలో కూడా ఎటువంటి ఆఽధారాలు లేకుండా హార్డ్ డిస్క్‌ను తీసుకెళ్లడంతో రెండు చోరీలు ఒకే ముఠా చేసిందన్న ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కథనం ప్రకారం నరసాపురం మండలం ఎల్‌బీ చర్ల గ్రామానికి చెందిన చామకూరి గోపి కొన్నేళ్ల నుంచి మొగల్తూరు, నరసాపురం మండ లాల సరిహద్దునున్న కేపీపాలెంలో జ్యూయలరీ, తాకట్టు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. శనివారం దుకాణం కట్టి వేసి ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం వెండి వస్తువు కోసం కస్టమర్ ఫోన్ చేశాడు. అయితే యాజమాని వెళ్ళకుండా షాపులో పనిచేసే వర్కర్‌కు తాళాలు ఇచ్చి పంపించాడు. షాపు తీయగానే పైన కన్నం వేసి ఉంది. వస్తువులన్నీ చిందరబందరగా పడ్డాయి. వెంటనే యాజమానికి ఫోన్ చేయడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పక్కా ప్లాన్‌తోనే చోరీ..
ఈ చోరీ పక్కా ప్లాన్‌గా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుకా ణానికి కొంది దూరంలోని మామిడితోటలో తాపీపనులకు ఆద్దెకిచ్చే పని ముట్ల దుకాణం ఉంది. అక్కడ నుంచి చెక్క నిచ్చెన తీసుకొచ్చి దుకాణం వెనుక నుంచి పెకి ఎక్కి కన్నం పెట్టారు. లోపల ఉన్న వెండి వస్తువుల్ని ముట్టకోలేదు. తాకట్టులో ఉన్న బంగారాన్ని మాత్రమే చోరీ చేశారు. శని వారం సాయంత్రం ఈ గ్రామానికి సమీపంలో ఉన్న రామన్నపాలెంలో ఇదే తరహాలో చోరీ జరిగింది. 8 కాసుల బంగారాన్ని ఎత్తికెళ్లారు.ఈ రెండు చోరీలు ఓకే తరహాలో జరగడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. సంఘ టన స్థలాన్ని జిల్లా అదనపు ఎస్పీ భీమరావ్, డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై వాసులు సందర్శించారు. జిల్లా నుంచి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. కుక్కలు గ్రామ శివారున్న బ్యాంకు వరకు వచ్చి అగి పోయాయి.