ఏలూరు ఎస్పీగా శివకిశోర్
ABN, Publish Date - Jul 14 , 2024 | 12:46 AM
ఏలూరు జిల్లా సూపరింటెం డెంట్ ఆఫ్ పోలీస్‌గా డైరెక్ట్ ఐపీఎస్ అధికారి (2019) కొమ్మి ప్రతాప్ శివ కిషోర్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
ఏలూరు క్రైం, జూలై 13 : ఏలూరు జిల్లా సూపరింటెం డెంట్ ఆఫ్ పోలీస్‌గా డైరెక్ట్ ఐపీఎస్ అధికారి (2019) కొమ్మి ప్రతాప్ శివ కిషోర్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా ఎస్పీగా విధు లు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ అధికారిణి దాసరి మేరీ ప్రశాంతిని అమరావతిలో ఉన్న డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయా లని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తండ్రి నారా యణ, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండగా తల్లి నిర్మల గృహిణి. శివ కిషోర్ వరిపాడు మండ లం సంచులూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు చదివారు. తొమ్మిది, పదో తరగతులను జవ హర్ నవోదయ విద్యాలయలో చదివారు. ఇంటర్ ఒక ప్రైవే టు కళాశాలలో చదివారు. 2015లో ఖరగ్‌పూర్‌ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం బాసే సెంట్రల్ ఆర్ట్‌మీ ఇంటెలిజెన్సీలో సీనియర్ డేటా శాస్త్రవేత్తగా ఉద్యోగం పొందా రు. 2018లో మూడో పర్యాయం సివిల్స్ రాసి ఉత్తీర్ణత సాధిం చి 2019 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా విధుల్లో చేరారు. ప్రస్తుతం అసిస్టెంట్ సూపరిం టెండెంట్ ఆఫ్ పోలీస్ గ్రేడ్ –1అధికారిగా అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతపల్లి సబ్ డివిజన్‌లో పనిచేస్తున్నారు. సాధారణ బదిలీలలో భాగంగా ఆయనను జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిష్టాత్మక ప్రైమ్ మినిస్టర్ కప్ అవార్డును ఆయన 2022లో అందుకున్నారు. సోమవారం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఎస్పీ మేరీ ప్రశాంతి సేవలు ప్రశంసనీయం
ఐపీఎస్ అధికారిణి దాసరి మేరీ ప్రశాంతి జిల్లా ఎస్పీగా 2023 ఏప్రిల్ 12వ తేదీన ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఏలూరులో జరిగిన ఒక యువతిపై యాసిడ్ దాడి, హత్య కేసులో 48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేయగా వారిలో ముగ్గురికి 108 రోజుల్లోనే స్పీడ్ ట్రైల్ కోర్టులో భాగంగా జీవిత ఖైదు పడే విధంగా కృషి చేశారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలకు సంబంధించిన కేసులలో 17 కేసుల్లో జీవిత ఖైదు శిక్షలు పడ్డాయి. కోర్టు స్పెషల్ మానిటరింగ్ సెల్ విభాగాలను ఏర్పాటు చేసి గ్రేవ్ కేసులపై పర్యవేక్షణ చేసి శిక్షలు పడేలా చర్యలు చేపట్టారు. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో సమర్థవంతంగా విధులను నిర్వర్తించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి పెద్ద పీటవేస్తూ ప్రతి శుక్ర వారం వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద జిల్లా ప్రజల హృద యాల్లో నిజాయితీ గల ఐపీఎస్ అధికారి ణిగా నిలిచారు. ‘ఆంధ్రజ్యోతి’తో శనివారం రాత్రి ఆమె మాట్లాడుతూ జిల్లా అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరి సహకారంతోనే సమర్థవంతంగా విధు లను నిర్వర్తించగలి గానని అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Jul 14 , 2024 | 12:46 AM