Share News

బయనపాలెం గణేశ్‌ ఉత్సవాల్లో ఉద్రిక్తత

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:51 AM

నరసాపురం మండలం ఎల్‌బీ చర్ల గ్రామంలోని బయనపాలెం ఆదివారం రాత్రి గణేష్‌ నిమజ్జనం ఉరేగింపులో ఇరు సామాజిక వర్గాల మద్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

బయనపాలెం గణేశ్‌ ఉత్సవాల్లో ఉద్రిక్తత
పోలీసుల పహరా..

ఊరేగింపులో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ

పలువురికి గాయాలు.. మోహరించిన పోలీసులు

నరసాపురం రూరల్‌, మొగల్తూరు,సెప్టెంబరు 15: నరసాపురం మండలం ఎల్‌బీ చర్ల గ్రామంలోని బయనపాలెం ఆదివారం రాత్రి గణేష్‌ నిమజ్జనం ఉరేగింపులో ఇరు సామాజిక వర్గాల మద్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఊరేగింపు సాగుతున్న సమయంలో ఒక పాట వేయడాన్ని మరో సామాజిక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన వాదోపవాదాలు ఘర్షణలకు దారితీశాయి. ఇరువురు పరస్పరం రాళ్ళతో దాడులు చేసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు గ్రామంలో హైటెన్షన్‌ నెలకొంది. ఇద్దరు పోలీసులతో పాటు పలువురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన తిరుమాని రాజేష్‌ను స్ధానికులు నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇద్దరు కానిస్టేబుళ్ళు కూడా రాళ్ళదాడిలో గాయాలయ్యాయి. స్థానికుల కఽథనం ప్రకారం గ్రామంలో మూడు రోజుల క్రితం గణేష్‌ ఊరేగింపు సందర్భంగా ఒక సినిమా పాట వేయడాన్ని గ్రామంలోని మరో సామాజిక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. తరువాత గ్రామ పెద్దలు ఈ పాటను వేయవద్దని ఆదేశించారు. అయితే ఆదివారం సాయంత్రం మరో సామాజిక వర్గం ఇదే పాటను వేస్తూ ఊరేగింపుగా వెళ్ళుతుండగా మళ్లీ ఆ సామాజిక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇరువురు మధ్య మాట మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. పరస్పరం రాళ్ళు విసురుకున్నారు. ఏఎస్పీ బీమారావు, డీఎస్పీ మురళీకృష్ణ, రూరల్‌ సీఐ కృష్ణ ప్రసాద్‌ మొగల్తూరు, రూరల్‌ ఎస్‌లు గ్రామానికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు. పరిస్ధితి పూర్తి అదుపులో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:51 AM