వృద్ధులకు భరోసాగా పింఛన్లు
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:01 AM
వృద్ధులు, అనారోగ్య పీడితులకు భరోసాగా ఉండేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున పింఛన్ల మొత్తాన్ని పెంచి వేకువజామునే అందజేస్తుందని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అన్నారు. శృంగవృక్షంలోని లెప్రసీ కాలనీలో సామాజిక పింఛన్లు అందించే కార్యక్రమాన్ని మంగళవారం ఆమె చేపట్టారు.
కలెక్టర్ చదలవాడ నాగరాణి
పాలకోడేరు, అక్టోబరు 1: వృద్ధులు, అనారోగ్య పీడితులకు భరోసాగా ఉండేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున పింఛన్ల మొత్తాన్ని పెంచి వేకువజామునే అందజేస్తుందని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అన్నారు. శృంగవృక్షంలోని లెప్రసీ కాలనీలో సామాజిక పింఛన్లు అందించే కార్యక్రమాన్ని మంగళవారం ఆమె చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారులకు పింఛన్లు, రేషన్ బియ్యా న్ని అందించి, కుష్టురోగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి వారికి పింఛన్లు అందించటం చాలా ఆనందంగా ఉందన్నారు. రిహాబిలిటేషన్ సెంటర్ ఫాదర్ తోట గాబ్రియేలు, నిర్వాహకురాలు లూర్దుమేరి, అడ్మినిస్ర్టేషన్ సిస్టర్ బ్రెజిత్, డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాల్, డీఎస్‌వో సరోజ, డీఎంహెచ్‌వో డాక్టర్ మహేశ్వరరావు, సర్పంచ్ జంగం సూరిబాబు పాల్గొన్నారు.
పాలకొల్లు టౌన్/భీమవరం టౌన్ : పాలకొల్లులో మంగళవారం ఉదయం చేపట్టిన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షించారు. వృద్ధురాలు పులపర్తి రంగనాయకమ్మకు పింఛన్ సొమ్మును ఆయన అందిం చారు. ఆయన మాట్లాడుతూ పెన్షన్ సొమ్ములు పంపిణీలో పొరపాట్లు లేకుండా సాయంత్రంలోపు పంపిణీ పూర్తి కావాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పాలకొల్లు తొమ్మిదో వార్డులో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న రేషన్ వాహనాన్ని, అదే ఏరియాలోని రేషన్ దుకాణాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. భీమవరంలో భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తామని జేసీ స్పష్టం చేశారు.
ఉండి : పేదలకు అండగా నిలవడమే సీఎం చంద్రబాబు ధ్యేయమని ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం కలిగొట్ల, కోలమూరు గ్రామాల్లో పింఛన్లను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. ఏపీఐఐసీ చైర్మన్‌గా ఎంపికైన మంతెన రామరాజును అభినం దించారు. అనంతరం జనసేన ఇన్‌చార్జి జూత్తిగ నాగరాజు మాట్లాడారు. కరిమెరక నాగరాజు, సర్పంచ్‌లు నడింపల్లి సత్యవతి రామకృష్ణం రాజు, బీజేపీ నాయకుడు పి.సుభాష్‌రాజు, పేరేచర్ల బాలరాజు, మురళీరాజు పాల్గొన్నారు.
భీమవరంటౌన్ : వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెత్త పన్నును ముఖ్య మంత్రి చంద్రబాబు రద్దు చేశారని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరం పట్టణం 29వ వార్డు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనంతరం నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యంరాజు, కార్యదర్శి గూడూరి సుబ్బారావు, జనసేన ఇన్‌చార్జి కటికల పల్లారావు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
పాలకొల్లు రూరల్/ఆకివీడు/ఆచంట : ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు. పాలకొల్లు మండలం కాపవరంలో మంగళవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ సొమ్మును అందజే శారు. సర్పంచ్ కోలాట రాధ, ఉపసర్పంచ్ అంగర వీరభద్రకుమార్, పాల విజయకుమారి, బ్రహ్మం పాల్గొన్నారు. ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో 95 శాతం పింఛన్లను కూటమి నాయకుల సాయంతో పంపిణీ చేశామని నగర పంచాయతీ కమిషనర్ జి.కృష్ణమోహన్ తెలిపారు. ఆచంట మండలంలో 98 శాతం పింఛన్లు అందించామని ఏవో వీఎస్‌ఎల్ జగన్నాఽథరావు తెలిపారు.
అత్తిలి/ఇరగవరం : కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఒక్క రోజులోనే అందరికీ అందేలా చూస్తోందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నా రు. అత్తిలిలోని కేఎస్ గట్టులో ఆయన పెన్షన్లు అందజేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు, దాసం బాబ్జి, పూతినీడి శ్రీనివాసరావు, కోరిపల్లి హరి, ఎంపీడీవో అమీలుజామ, కడల శ్రీను పాల్గొన్నారు. ఇరగవరం మండలం గోటేరులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పింఛన్లు పంపిణీ చేశారు. మండలంలో 96.30శాతం పింఛన్ల పంపిణీ జరిగిందని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు.