మహిళపై కోతుల దాడి
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:22 AM
ముదినేపల్లిలో కోతులు స్వైర విహారం చేస్తున్నా యి. తాటాకు ఇళ్ల పై కప్పులు పీకేయటమే కాక, ఇళ్లలోని తినుబండారాలను కూడా ఎత్తుకుపోతున్నాయి.
ముదినేపల్లి, అక్టోబరు 1: ముదినేపల్లిలో కోతులు స్వైర విహారం చేస్తున్నా యి. తాటాకు ఇళ్ల పై కప్పులు పీకేయటమే కాక, ఇళ్లలోని తినుబండారాలను కూడా ఎత్తుకుపోతున్నాయి. అడ్డగిస్తే దాడి చేస్తున్నాయి. మంగళవారం స్థానిక అంబేడ్కర్ నగర్‌లో కోతులు మరింత రెచ్చిపోయాయి. కారే వెంకటేశ్వరమ్మ అనే మహిళపై దాడి చేశాయి. కోతులు ఉన్నట్లుండి దాడికి దిగటంతో ఆ మహిళ కింద పడి పోగా, కాళ్లు, మెడ, చేతులపై కరిచాయి. కొంతమంది కర్రలతో రావటంతో కోతులు పారిపోయాయి. వెంటనే వెంకటేశ్వరమ్మను ఆమె భర్త కోటేశ్వరరావు తదితరులు ముదినేపల్లి పీహెచ్‌సీకి తరలించారు. కోతుల సమస్యను ఎన్నోసార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సేవా నాగ జగన్ బాబూరావు కోరారు.