మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:58 AM
మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక విద్యుత్ భవన్‌లో ఇంజినీర్స్ డే ఘనంగా నిర్వహించారు. సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ సాల్మన్‌రాజు, పలువురు ఇంజినీర్లు విశ్వేశ్వరయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.
ఏలూరు రూరల్, సెప్టెంబరు 15: మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక విద్యుత్ భవన్‌లో ఇంజినీర్స్ డే ఘనంగా నిర్వహించారు. సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ సాల్మన్‌రాజు, పలువురు ఇంజినీర్లు విశ్వేశ్వరయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం సాల్మన్ రాజును సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ఆయన చేసిన సేవలకు గాను గుర్తింపుగా భారతరత్న అవార్డు ఇచ్చారని ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ ఈఈ పీఎన్‌బీ నటరాజన్, టి.శశిధర్, కె.సత్యకిషోర్, టి.రామకృష్ణ, ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు ఎన్.రఘుబాబు, కృష్ణరాజన్, బీమేశ్వరరావు, రమేష్, మారుతీ, కె.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఇంజనీర్లకు సత్కారం
ఏలూరు అర్బన్, సెప్టెంబరు 15 : ఇంజనీర్స్ డే సందర్భంగా ఆదివారం స్థానిక సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజనీర్లను సత్కరించారు. హైదరాబాద్ ఈసీఐఎల్ డీజీఎం, దీపక్ జెన్ డైరెక్టర్ కొల్లి రాజశేఖరరావు, నీటిపారుదల శాఖ సూపరి ంటెండెంట్ ఇంజనీర్ ముక్కామల వెంకట కృష్ణారావును ఘనంగా సన్మా నించారు. సంఘ అధ్యక్షుడు ప్రసాద్, బాపినీడు చౌదరి, శివరామ కృష్ణారావు, ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు వడ్లపట్ల నారాయణరావు పాల్గొన్నారు.
నిరంతర కృషీ వలుడు
భీమడోలు, సెప్టెంబర్ 15 : నవ భారత నిర్మాత మోక్షగుడ్డం విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు అన్నారు. భీమడోలు శాఖా గ్రంథాలయంలో గ్రంథపాలకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహించారు. మోక్షగుడ్డం విశ్వేశ్వరయ్య 163వ జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి సామాజిక కార్యకర్త మండే సుధాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.