గోదావరి ఉగ్రరూపం
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:32 AM
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉరకలు వేస్తోంది. బుధవారం ప్రవాహం మరింతగా పెరగడం తో పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. పెదమల్లం మాచేనమ్మ ఆలయం చుట్టూ మునిగిపోయిం ది.
ఆరు లక్షల క్యూసెక్కుల నీటి విడుదల
మాచేనమ్మ ఆలయాన్ని తాకుతున్న వరద.. నీటిలోనే కనకాయలంక కాజ్‌వే
నరసాపురంలో రెండో రోజు పంటు ప్రయాణం నిలిపివేత
ఆచంట/పెనుగొండ/యలమంచిలి/నరసాపురం, సెప్టెంబరు 11 : ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉరకలు వేస్తోంది. బుధవారం ప్రవాహం మరింతగా పెరగడం తో పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. పెదమల్లం మాచేనమ్మ ఆలయం చుట్టూ మునిగిపోయిం ది. గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నాటు పడవల రాకపోకలను నిషేధించారు. పెనుగొండ మం డలంలోని పల్లపు లంక భూము నీట మునుగుతున్నా యి. వరద ఉధృతి ఇదేవిధంగా ఉంటే గురువారం సాయంత్రానికి లంక భూములన్నీ నీట మునుగుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంకల్లోని పశువులను ఏటిగట్టుపైకి చేరుస్తున్నారు. యలమంచిలి మండలం కనకాయలంక కాజ్‌వే రెండో రోజు ముంపు లోనే ఉంది. కాజ్‌వే వద్ద గ్రామస్థులు పడవలపై రాక పోకలు కొనసాగుతున్నాయి. కనకాయలంక, పెదలం క, యలమంచిలిలంక, బాడవ, లక్ష్మీపాలెం, దొడ్డిపట్ల, పల్లిపాలెం ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ఏటిగట్టుకు లోపల వున్న లంకభూములు ముంపుబారిన పడుతు న్నాయి. వశిష్ఠ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి బుధవారం ఆరు లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచి పెట్టడంతో నరసాపురం అన్ని రేవుల్లో ప్రమాదస్థాయిలో వరద ప్రవహిస్తోంది. వలంధర్ రేవులో స్నానాలు నిలిపివేశారు. బాపు ఘాట్, వలంధర్ రేవులోని పిండాల రేవుల్లో వరద నీరు చేరింది. రెండో రోజు గోదావరిలో రాకపోకలను నిలిపివేశారు. నరసాపురం– సఖినేటిపల్లి రేవుల మధ్య పంటు, పడవలు నడవలేదు. రేవుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పల్లపు ప్రాంతాలు నీట మునగకుండా అధికారులు మాధవాయిపాలెం, ధర్బరేవు, ఈస్ట్ కుక్కులేరు అవుట్‌ఫాల్ స్లూయిస్ తలుపుల్ని మూసివేశారు. గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నదిలో వేట సాగలేదు. పొన్నపల్లిలోని కొన్ని వార్డులోకి వరద నీరు చేరింది. మునిసిపల్ సిబ్బంది మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడుతున్నారు. ఆర్డీవో అంబరీష్, ఏటిగట్టుల శాఖ ఏఈ సుబ్బారావు ఏటిగట్లను పరిశీలించారు.