గణనాథుని నిమజ్జనం
ABN , Publish Date - Sep 12 , 2024 | 01:13 AM
నియోజవర్గంలోని పలు గ్రామాల్లోని మండపాలలో కొలువుదీరిన గణనాథుల నిజ్జనం కమిటీ సభ్యులు కోలాహలంగా నిర్వహిస్తున్నారు. మేళతాళాలు, తీన్ మార్, విచిత్ర వేషధారణలతో స్వామివారి ఊరేగింపులు సాగుతున్నాయి. స్వామి వారి లడ్డూలకు వేలం నిర్వహిస్తున్నారు.
నియోజవర్గంలోని పలు గ్రామాల్లోని మండపాలలో కొలువుదీరిన గణనాథుల నిజ్జనం కమిటీ సభ్యులు కోలాహలంగా నిర్వహిస్తున్నారు. మేళతాళాలు, తీన్ మార్, విచిత్ర వేషధారణలతో స్వామివారి ఊరేగింపులు సాగుతున్నాయి. స్వామి వారి లడ్డూలకు వేలం నిర్వహిస్తున్నారు. ఐదో రోజైన బుధవారం పలు చోట్ల ఏర్పాటు చేసిన అన్న సమారాధనలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిమజ్జనాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏలూరు టూ టౌన్/ఏలూరు కార్పొరేషన్ దెందులూరు/పోలవరం/బుట్టాయగూడెం/ ఏలూరు రూరల్/ కొయ్యల గూడెం/ జీలుగుమిల్లి/ పెదపాడు/టి.నరసాపురం/ ఉంగుటూ రు/జంగారెడ్డిగూడెం/పెదవేగి/ద్వారకాతిరుమల సెప్టెంబరు 11 : పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక భద్రతా పోలీసు విభాగ కార్యాలయం వద్ద బుధవారం హెడ్ కానిస్టేబుల్ రాజేష్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. విగ్రహాన్ని బోట్ పాయింట్ ప్రాంతంలో నిమజ్జనం చేశారు. ప్రాజెక్టు ఏఎస్‌ఐ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు మురళి గణేశ్, రాజేష్, రాము, పారినాయుడు పాల్గొన్నారు. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరంలో గీతా మందిరం వద్ద గణేషుని విగ్రహాం వద్ద ఏర్పాటు చేసిన లడ్డూలను బుధవారం వేలం నిర్వహించగా 8 కేజీల లడ్డూను శీలబోయిన తాతారావు దంపతులు రూ.7,600లకు, 15 కేజీల లడ్డూను కొండపల్లి గంగాధర్ దంపతులు రూ.13,500లకు దక్కించుకున్నారు. పెదపాడు మండలం సత్యవోలులో జరిగిన గణపతి నవరాత్రి పూజా కార్యక్రమాల్లో జడ్పీ ఛైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాదరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు సత్రంపాడులో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీగణపతి స్వామి వారి ఆలయంలో నగర మేయర్ నూర్జహాన్, ఎస్‌ఎంఆర్ పెదబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు లక్ష్మీప్రభాకర్, ఎన్‌వీవీఎస్ ప్రసాద్, సోమేశ్వరరావు, ఆర్‌కే ప్రసాద్, శ్రీను, కార్పొరేటర్ నరసింహారావు, శ్రీనివాసరావు, ఎస్.శ్రీనివాసరావు, ప్రవీన్, తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం కైకరం ఒకటో వార్డులో నిర్వహించిన లడ్డూ వేలంలో గ్రామానికి చెందిన శ్రీ కృష్ణ దేవరాయ కాపు సంఘం తరఫున రంగా యువసేన గౌరవాధ్యక్షుడు వెజ్జు వెంకట సుబ్బారావు లడ్డూ దక్కించుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు వినాయక చవితి పందిళ్ళలో జరిగిన అన్న సమారాధన కార్యక్రమాల్లో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామకుమార్, పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ పాల్గొన్నారు. ద్వారకాతిరుమల తూర్పువీధిలో లంబోదర వినాయక కమిటీ ఏర్పాటు చేసిన గణపతి విగ్రహ నిమజ్జనం వైభవంగా జరిగింది. మేళతాళాలు, తీన్‌మార్ నృత్యాలు, విచిత్ర వేషధారణల నడుమ గ్రామంలో ఊరేగించి శ్రీవారి పుష్కరిణిలో నిమజ్జనం చేశారు.