Share News

ముంపులోనే లంక గ్రామాలు

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:45 AM

కొల్లేరు వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతుండడంతో లంక గ్రామాల ప్రజలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

ముంపులోనే లంక గ్రామాలు
ముంపులో చటాకాయ రహదారి

కొనసాగుతున్న కొల్లేరు వరద

చేపలు,రొయ్యల చెరువులకు గండ్లు

జలమయమైన చటాకాయ రహదారి

బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పెంచికలమర్రు, గుమ్మళ్ళపాడు, శృంగవరప్పాడు

కైకలూరు/ మండవల్లి/ఏలూరు రూరల్‌/భీమడోలు, సెప్టెంబరు 11 : కొల్లేరు వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతుండడంతో లంక గ్రామాల ప్రజలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎటు చూసినా కంటిచూపు మేరకు కొల్లేరు ఉరకలు వేస్తూ వరద నీరు ప్రవహిస్తోంది. కైకలూరు మండలంలోని చటాకాయ, నత్తగుల్లపాడు ప్రధాన రహదారిపై బుధవారం మూడు అడుగుల మేర నీరు చేరింది. ప్రత్యామ్నాయ రహ దారి లేకపోవడంతో ప్రజలు ఆ నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఒకవైపు గ్రామానికి ఆనుకుని ఉన్న చేపల చెరువులు కొల్లేరు గర్భంలోకి కలిసిపోయాయి. ఆలపాడు నుంచి కొల్లేటికోట పెద్దింటి అమ్మవారి ఆల యానికి వెళ్లే రోడ్డు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. సర్కారు కాల్వ నుంచి కొల్లేటికోట పీహెచ్‌సీ వరకు రాకపోకలు నిలిచిపోయాయి. కొల్లేరు ఉధృతిగా ప్రవహించడంతో రహదారిపై నాలుగు అడుగుల మేర నీరు చేరింది. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర వడ్డీసాధికారిక సమితీ కన్వీనర్‌ బలే ఏసురాజు 30 టన్నుల పడవ ను ఏర్పాటు చేసి పెంచికలమర్రు నుంచి పందిరి పల్లిగూడెం, గుమ్మళ్ళపాడు, శృంగవరప్పాడు గ్రామా ల ప్రజలను చేరవేస్తున్నారు. పెంచికలమర్రులో మంచినీటి చెరువు ముంపునకు గురికావడంతో గ్రామప్రజలు తాగునీటి ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. మండవల్లి మండలంలో లంక గ్రామాల న్నీ ముంపులోనే ఉన్నాయి. వరద ఉధృతి వల్ల ఆక్వా రంగా నికి చావుదెబ్బ తగిలింది. చెరువు గట్లు ముంపునకు గురై చెరు వుల్లోని చేపలు కొల్లేరు పాలవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. చెరువుకు గండ్లు రైతులు రాత్రింబవళ్ళు మట్టి బస్తాలతోనే అడ్డుకట్టు వేయడమే గాక కర్రలు పాతి వలలను కట్టి చేపలు, రొయ్యలను కాపాడుకుంటున్నారు. ఇంగిలిపాకలంక, మణుగులూరు, కొవ్వాడలంక, పెనుమాకలంక తదితర గ్రామా ల్లో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మూడు తాళ్లపాడు, ఉనికిలి, మూలపేట గ్రామాలకు సైతం ముంపు తాకింది. అయ్యవారిరుద్రవరం, పెరికేగూడెం, కానుకొల్లు గ్రామాల్లో వరిపొలాలు నీటిలో మగ్గుతున్నాయి. ఏలూరు రూరల్‌ మండ లంలో . మొండికోడు, గుడివాకలంక రహదారు ల పై వరదనీరు ప్రవహి స్తూనే ఉంది. బుధవారం ఉదయం స్వల్పంగా తగ్గి నా సాయంత్రానికి కొద్దిగా వరద ప్రవాహం పెరగడంతో రాకపోకలను నిలిపి వేశారు. గుడివాకలంక, కోమటిలంక, మొండికోడు తదితర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాధవరం, మొండికోడు, కోమటి లంక, యాగనవిల్లి, ప్రత్తికోడులంక తదితర గ్రామా ల్లో వరదనీరు భారీగా చేరడంతో ఆ గ్రామాల ప్రజ లు ప్రస్తుతం నీటిలోనే ఉండాల్సిన పరిస్థితి. చాట పర్రు మీదుగా లంక గ్రామాలకు వెళ్లే రహదారులు జలమయం కావడంతో ఆ గ్రామాలకు వెళ్ళే ప్రజలు భీమడోలు, గుండుగొలను మీదుగా 60 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేయాల్సి వస్తోంది. భీమడోలు మండ లంలో కొల్లేరు గ్రామాలకు వచ్చి చేరుతున్న నీటి ఉదృతి బుధవారం తగ్గుముఖం పట్టింది. కొల్లేరు మినహా గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నీరు తగ్గిం ది. మల్లవరంలో నల్లకోడు వద్ద డ్రెయిన్‌ వరద నీటితో పరుగులు పెడు తుండగా కర్రకోడు వద్ద నీటి ఉధృతి పెరిగింది.

ఉధృతంగా ప్రవహిస్తున్న ఉప్పుటేరు

కలిదిండి : మండలంలో ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వలకట్లు కొట్టుకునే పోయ్యే ప్రమాదం ఉందని మత్స్య కారులు ఆందోళన చెందుతు న్నారు. ఉప్పుటేరు ఉధృతికి పడవలు కొట్టుకు పోకుండా ఒడ్డుకు చేర్చారు. మట్టగుంట, పెదలంక పల్లిపాలెంలో ఉప్పు టేరులో జనాన్ని అవతల వైపు నకు తీసుకెళ్లే బోటులను అధికారులు నిలు పుదల చేశారు. సున్నంపూడి, దుంపలకోడు దిబ్బ, మద్వానిగూడెం, కొండం గి పల్లిపాలెంలో ఉప్పు టేరులో నీరు డ్రెయిన్ల ద్వారా చొచ్చుకుని వస్తోంది. సున్నంపూడిలో ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు.

Updated Date - Sep 12 , 2024 | 12:45 AM