Share News

వరద బాధితులకు ఆపన్నహస్తం

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:34 AM

ప్రతి ఒక్కరూ విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మానవత్వంతో ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ రూ. 2లక్షల 50 వేలు వరద బాధితులకు సహాయార్ధం ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు.

వరద బాధితులకు ఆపన్నహస్తం
ఎమ్మెల్యే అంజిబాబుకు రూ.2.50 లక్షలు అందిస్తున్న రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌

భీమవరంటౌన్‌, సెప్టెంబరు 15 : ప్రతి ఒక్కరూ విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మానవత్వంతో ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ రూ. 2లక్షల 50 వేలు వరద బాధితులకు సహాయార్ధం ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ సభ్యులు మానెపల్లి సత్యనారయణ గుప్తా, తుమ్మలపల్లి శివ, బోండా సత్యనారాయణ, కురిశేటి సత్యనారా యణమూర్తి, కురిశేటి సాయిరామ్‌కుమార్‌, కుర్మల రాజా, మానేపల్లి బధిరి, కుర్మాల పూర్ణరావు, కొక్కిరాల ఫణి, తటవర్తి బాబీ పాల్గొన్నారు. పలువురు దాతలు రూ.3 లక్షల సహాయాన్ని, చింతలపాటి రాజంరాజు (రాజబాబు) రూ.2లక్షలు, విశాఖపట్నంకు చెందిన కలిదిండి నరసింహరాజు రూ.లక్ష విరా ళం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు దాతలు రూ.2లక్షల 50 వేలు, జనసేన పార్టీ రాయలం–1 ఉపాధ్యక్షుడు యర్రంశెట్టి శివకృష్ణ రూ.25 వేలు, ఆర్య సీఫుడ్స్‌ రూ.2 లక్షల చెక్కును ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. ఈ సందర్భంగా దాతలను ఎమ్మెల్యే అభినం దించారు. కొనిశెట్టి రామలింగేశ్వరరావు (లింగబాబు), మాగపు భగత్‌సింగ్‌, యర్రంశెట్టి రాజేష్‌, సమ్మెట రాంజీ, టీడీపి రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, వబిలిశెట్టి రామకృష్ణ, రమేష్‌బాబు పాల్గొన్నారు.

భీమవరంటౌన్‌ : విజయవాడ వరదబాధితుల సహాయార్ధం భీమవరానికి చెందిన వైద్యులు నాగిడి హరిశ్చంద్రప్రసాద్‌, నాగిడి వెంకటపద్మ లక్షా 50 వేల రూపాయలను ఆదివారం రాత్రి ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబుకు ఆయన కార్యాలయంలో అందించారు. దంపతులను అంజిబాబు అభినందించారు.

తాడేపల్లిగూడెం అర్బన్‌ : విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆదివారం పట్టణంలోని జనసేన కార్యాలయంలో ఎమెల్యే బొలిశెట్టికి పలు వురు విరాళాలు అందజేశారు. వీరంపాలెంకు చెందిన కేతిరెడ్డి రాంబాబు రూ. 25 వేలు, నడింపల్లి సత్యనారాయణరాజు రూ.50వేలు, తాడేపల్లిగూడెం క్రిస్ట్‌ లూథరన్‌ చర్చి నుంచి రూ. లక్ష, విఘ్నేశ్వర హోల్‌సేల్‌ పండ్ల వర్తక సంఘం రూ. 50 వేలు, తాడేపల్లిగూడెం పిరమిడ్‌ స్పిరిచ్యు వల్‌ సొసైటీ రూ 32, 500 లు, మారంపల్లి నుంచి రజక సంఘం రూ. 10 వేలు, అమృతపురం నుంచి సుబ్బరాజు రూ. 25 వేలు ఎమ్మెల్యేకు అందజేశారు.

తాడేపల్లిగూడెం అర్బన్‌:వరద బాధితుల సహాయార్థం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి పిలుపు మేరకు పలువురు టీడీపీ నాయకులు ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద వలవల బాబ్జికి విరాళాలు అందజేశారు. కొండ్రుపోలు గ్రామం నుంచి టీడీపీ నాయకులు రూ. 50 వేలు, మునుకుట్ల మల్లిక్‌ రూ. 10 వేలు విరాళాలు అందజేశారు.

తణుకు : వరద బాధితుల సహాయార్థం తణుకులోని ఆదర్శ స్కూలు యాజమాన్యం సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. 40 వేల చెక్కును ఎమ్మెల్యే ఆరిమి ల్లి రాధాకృష్ణకు ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో అందిం చారు. స్కూలు డైరెక్టర్లు బసవా రామకృష్ణ, బాబు ఆంటోనీ, కె.శ్రీనివాసు పాల్గొన్నారు.

తణుకు : విజయవాడ వరద బాధితులకు మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ తాతపూడి మారుతీరావు సతీమణి కామేశ్వరి మహిళా బృందంతో ఆంధ్రా షుగర్స్‌, హౌసింగ్‌ బోర్డు కాలనీలో సేకరించిన నిత్యావసరాలను విజయవా డలోని సింగ్‌ నగర్‌, వాంబే కాలనీ వరద బాధితులకు ఆదివారం పంపిణీ చేశారు. 800 చీరలు, 200 ప్యాంట్లు, షర్టులు, 400 చిన్నపిల్లలు దుస్తులు, వంద దుప్పట్లు, 600 దోమల అగరబత్తీలు, అగ్గిపెట్టెలు, వంద టవల్స్‌ను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాలు మేరకు పంపిణీ చేసినట్టు మారుతీ రావు చెప్పారు. కలగర వెంకట కృష్ణ, ఒమ్మి రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:36 AM