Share News

తాడేపల్లిగూడెంలో క్రికెట్‌ స్టేడియం

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:38 AM

తాడేపల్లిగూడెంలో క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

తాడేపల్లిగూడెంలో క్రికెట్‌  స్టేడియం
స్టేడియం కోసం స్థలం పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

స్థలం పరిశీలించిన కలెక్టర్‌, ఎమ్మెల్యే

తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెంబరు 15: తాడేపల్లిగూడెంలో క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో స్టేడియం నిర్మాణానికి తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను జడ్పీ భూములను పరిశీలించారు. తర్వా త ఆ ప్రస్థావనే లేకపోవడంతో క్రీడాకారులు నిరుత్సాహపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ క్రికెట్‌ స్టేడి యం నిర్మాణంపై దృష్టి సారించారు. నన్నయ యూనివర్శిటి క్యాంపస్‌ ఎదురుగా ఉన్న 12 ఎకరాల భూమిని స్టేడియం కోసం కలెక్టర్‌ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ పరిశీలించారు.

గతంలో స్టేడియం నిర్మాణానికి తాడేపల్లిగూడెంకు దూరంగా ఆరుగొలనులో ఏర్పాటుకు పరిశీలించినా కార్యరూపం దాల్చలే దు. తాజాగా ఏపీ నిట్‌, నన్నయ క్యాంపస్‌ సమీపంలోని స్థలం పరిశీలించడంతో అందరికి అందుబాటులో ఉంటుందని పలువు రు భావిస్తున్నారు. దీనికితోడు తాడేపల్లిగూడెం సమీప ప్రాంతా ల్లోని పలు క్రీడా అసోసియేషన్లు నిర్వహించే ఈ స్థలంలోనే టోర్నమెంట్‌లు నిర్వహిస్తుంటారు.

స్థలం అప్పగిస్తే స్టేడియం నిర్మిస్తాం

క్రికెట్‌ స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వం 12 ఎకరాల స్థలాన్ని అప్పగిస్తే దాతల సహకారంతో నిర్మాణ బాధ్యత తీసుకుంటా మని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ తెలిపారు. త్వరలోనే క్రీడాభి మానులందరికీ ఆనందాన్నిచ్చే క్రికెట్‌ స్టేడియం నిర్మాణం కార్య రూపం దాలుస్తుందని పలువురు భావిస్తున్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:39 AM