పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:09 AM
పర్యావరణ పరిరక్షణకు సమస్టిగా కృషి చేయాలని, పర్యావరణాన్ని పరిర క్షించడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
పలుచోట్ల మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
భీమవరంటౌన్, సెప్టెంబరు 4 : పర్యావరణ పరిరక్షణకు సమస్టిగా కృషి చేయాలని, పర్యావరణాన్ని పరిర క్షించడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. జైత్ర బిజినెస్ సాల్యుయేషన్స్, వెస్ట్ బెర్రీ స్కూల్, శ్రీభగవాన్ ట్రేడర్స్ ఆధ్వరంలో ఐదు వేల ఉచిత మట్టి వినాయక ప్రతిమలను జేపీ రోడ్డులోని శ్రీభగవాన్ ప్లాజా వద్ద కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి చేతులమీదుగా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ గత పదకొండేళ్లుగా మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్న సుబ్బరాజును అభినందించారు. చెరుకువాడ రంగసాయి, నడింపల్లి మహేష్‌కుమార్‌వర్మ, నడింపల్లి వెంకటరామరాజు, గాదదిరాజు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ మట్టి వినాయక పత్రిమలనే వాడాలని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. రెస్ట్‌హౌస్ రోడ్‌లో రక్షధల్ సేవా సంస్థ వ్యవస్థాపకడు మంగదొడ్డి మహేంద్ర ఆధ్వర్యంలో మూడు వేల మట్టి వినాయక ప్రతిమలను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రొటోకాల్ చైర్మన్ మల్లినీడి తిరుమ లరావు, జనసేన జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, జనసేన రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి ఉండపల్లి రమేష్ నాయుడు, జనసేన నాయకులు భీమాల శ్రీరామమూర్తి, కొప్పర్తి నరసింహారావు, విజ్జురోతి రాఘవులు, పడమటి రామకృష్ణ, జనసేన ఎంపీటీసీ తాతపూడి రాంబాబు, చల్లా రాము తదితరులు పాల్గొన్నారు.
మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో డీఎన్నార్ కళాశాల రోడ్ తాడిమళ్ళ గిరి కాంప్లెక్స్ వద్ద మట్టి గణపతి విగ్రహం, గణపతి వ్రత పుస్తకం, పండ్లను ఎమ్మెల్యే అంజిబాబు చేతులమీదుగా అందించారు. మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, పీఆర్వో భట్టిప్రోలు శ్రీనివాసరావు, కారుమూరి సత్యనారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.