Share News

రూ.5,29,600 సీజ్‌

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:47 PM

సార్వత్రిక ఎన్నికల నేప ఽథ్యంలో స్క్వాడ్‌ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేస్తు న్నాయి. కొత్తూరు చెక్‌పోస్టు వద్ద బుధవారం ఉంగు టూరు మండలం నల్లమాడు గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి లక్షా ఆరు వేల రూపా యల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్‌ రమేష్‌ తెలిపారు.

రూ.5,29,600 సీజ్‌
తాటియాకులగూడెం సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పట్టుకున్న రూ.ల క్ష నగదు చూపుతున్న అధికారులు

విస్తృతంగా తనిఖీలు

కామవరపుకోట/భీమడోలు/చింతలపూడి,/ఉంగు టూరు / జీలుగుమిల్లి, / ఏలూరు క్రైం ,ఏప్రిల్‌ 3. సార్వత్రిక ఎన్నికల నేప ఽథ్యంలో స్క్వాడ్‌ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేస్తు న్నాయి. కొత్తూరు చెక్‌పోస్టు వద్ద బుధవారం ఉంగు టూరు మండలం నల్లమాడు గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి లక్షా ఆరు వేల రూపా యల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్‌ రమేష్‌ తెలిపారు. మంగళవారం రాత్రి తనిఖీల్లో రూ.76,600 నగదు స్వాధీనం చేసు కున్నామన్నారు. ఎన్నికల స్కాడ్‌ అధికారిణి సత్య వాణి ద్వారా ఏలూరు ఎన్నికల ట్రెజరీ అధికారికి పంపిం చామన్నారు. ఎన్నికల అధికారి ఎండీ మొహిద్దీన్‌, తడికల పూడి ఎస్‌ఐ జయబాబు, ఏఎస్‌ఐ వీరాస్వామి, వీఆర్‌వో బాబూరావు, కె.రామకృష్ణ, జి.సూర్యా రావు, నాగార్జున, షేక్‌ నాగూర్‌ సాహెబ్‌, సౌజన్‌ సాయి తదితరులు ఉన్నారు. భీమడోలు మండలం గుండుగొలను హైవేపై ఫ్లైయింగ్‌ స్వాడ్‌ జరిపిన తనిఖీల్లో లక్ష రూపాయల నగదు గుర్తించి స్వాధీన పర్చుకున్నట్టు ఏలూరు ఆర్డీవో, ఆర్వో ఖాజావలీ తెలిపారు. చింతలపూడి మండలం అల్లిపల్లి చెక్‌పోస్టు రూ.70 వేలు నగదుకు ఎటువంటి పత్రాలు చూపకపోవడంతో సీజ్‌ చేసి జిల్లా ట్రెజరీకి జమ చేసినట్లు సహాయ ఎన్నికల అధికారి గోపాలకృష్ణ తెలిపారు. ఉంగుటూరు వద్ద ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బుధవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించగా కారులో రూ.77 వేలు స్వాధీనం చేసుకున్నట్లు ఆర్వో ఖాజావలి తెలిపారు.తాటియాకులగూడెం రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద అశ్వారావు పేటనుంచి మక్కినవారిగూడెంవెళుతున్న కారు తనిఖీ చేయగా రూ.లక్ష నగదు గుర్తించారు. నగదు ట్రెజరీకి అప్పగించనున్నట్లు ఎస్సై వి.చంద్రశేఖర్‌ చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 28 వేల 130 రూపాయలు విలువైన 69.01 లీటర్ల మధ్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నాలుగు లక్షల 67 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు అని తెలిపారు.

Updated Date - Apr 03 , 2024 | 11:47 PM