మోటార్ సైకిళ్ల దొంగ అరెస్టు
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:51 PM
అంతర జిల్లాల మోటార్ సైకిళ్ల దొంగను అరెస్టు చేసి 16 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు డీఎస్పీ డీ.శ్రవణ్ కుమార్ గణపవరం పోలీస్‌స్టేషన్‌లో వివరాలు తెలిపారు.
16 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం
గణపవరం, అక్టోబరు 1: అంతర జిల్లాల మోటార్ సైకిళ్ల దొంగను అరెస్టు చేసి 16 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు డీఎస్పీ డీ.శ్రవణ్ కుమార్ గణపవరం పోలీస్‌స్టేషన్‌లో వివరాలు తెలిపారు. ఏలూరు జిల్లా కొయ్యల గూడెం మండలం చొప్పరామన్నగూడెం గ్రామానికి చెందిన చప్పిడి ముస లమ్య ఏలూరు, పశ్చిమ, కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు, జిల్లాల పరిధిలోని మోటార్ సైకిళ్ళ దొంగతనాలకు పాల్పడుతున్నాడని అన్నారు. గణపవరం మండలం ముగ్గళ్ళ గ్రామానికి చెందిన శెట్టి చిన్నాతో కలిసి ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్ప డుతున్నాడని అన్నారు. గతంలో చిన్నాను అరెస్టు చేయగా మంగళవారం ముస లయ్యను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మొత్తం రూ.40 లక్షల విలువ గల 45 ద్విచక్ర వాహనాలు, ఆటో స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కేసును చేధించిన నిడమర్రు సీఐ ఎంవీ.సుభాష్, ఎస్‌ఐ మణికుమార్, పోలీస్ సిబ్బంది హేమసుందర్, కాంతయ్య, రత్నబాబు, సత్యనారాయణ, జగపతిబాబులను జిల్లా ఎస్పీ కిషోర్, డీఎస్పీ శ్రవణ్‌కుమార్ అభినందించారు.