Share News

ఆకివీడు జలమయం

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:34 AM

కొల్లేరు వరద ఉధృతితో ఆకివీడు అతలాకులమైంది. నాలుగురోజులుగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రభావం తో ఉప్పుటేరు, చినకాపవరం మురుగు కాల్వలో ఉధృతి తీవ్రస్థాయికి చేరింది. వేల ఎకరాలు నీట మునిగాయి.

ఆకివీడు జలమయం
కోళ్ళపర్రు వంతెనపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు

ఉధృతంగా ప్రవహిస్తున్న ఉప్పుటేరు

ఉప్పొంగిన చినకాపవరం మురుగు కాల్వ

సిద్దాపురం, కళింగపాలెం, చినిమిల్లి పాడు గ్రామాలకు రాకపోకలు బంద్‌

కోళ్ళపర్రు వంతెనపై నుంచి నీరు

ఆకివీడు/ఆకివీడు రూరల్‌, సెప్టెంబరు 11 : కొల్లేరు వరద ఉధృతితో ఆకివీడు అతలాకులమైంది. నాలుగురోజులుగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రభావం తో ఉప్పుటేరు, చినకాపవరం మురుగు కాల్వలో ఉధృతి తీవ్రస్థాయికి చేరింది. వేల ఎకరాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యా యి. ప్రజలను ముంపు భయాందోళనకు గురిచేస్తోంది. ఉప్పుటేరులో తూడు, గుర్రపుడెక్క తొలగించడంతో వరద నీటి ప్రవాహం వేగం పుంజుకుంది. సమతానగర్‌ చినకాపవరం మురుగు కాల్వ వరద నీరు బుధవారం తారస్థాయికి చేరుకోవడంతో వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది. వంతెనకు ఒకవైపు గొయ్యి ఏర్పడింది. గ్రామస్థులు భారీ వాహనాలను నిలిపివేసేందుకు కొం తమేర అడ్డుకట్టారు. ఆకివీడు నుంచి చినిమిల్లిపాడు, సిద్దాపురం, కళింగపాలెం వెళ్ళేందుకు రహదారి బంద్‌ అయ్యింది. చంద్రబాబు కాలనీ, సీహెచ్‌సీ ప్రభుత్వాసుపత్రి, రైల్వే క్యాబిన్‌ కింద, మాదివాడ, శాంతినగర్‌, సమతానగర్‌, సిద్ధాపురం వైపు వెళ్ళు ప్రాంతం, జవహర్‌పేట తదితర ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కొందరిని పునరావాసానికి అధికారులు తరలించారు. ముంపు నివార ణకు నగర పంచాయతీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పొట్ట దశకు వచ్చిన పంట పొలాలు వరదకు నీట మునుగుతుండగా రైతులు ఇంజన్ల సాయంతో నీటిని బయటకు పంపిస్తున్నారు. అటవీ శాఖ చెక్‌ పోస్టు వద్ద రోడ్డుపై నీటిమట్టం పెరగడంతో ట్రాక్టర్లు తప్ప ఇతర వాహనాలు వెళ్ళడం లేదు. ఆ గ్రామాల ప్రజలు కోళ్ళపర్రు మీదుగా ఆకివీడు వెళుతున్నారు. మరింత నీటి మట్టం పెరిగితే కోళ్ళపర్రు వంతెన వద్ద నీటి ప్రవాహం పెరుగుతుందని, అప్పుడు పడవలే శరణ్యమని ప్రజలు వాపోతు న్నారు. గుమ్ములూరు ఎస్‌సి కాలనీ, కోళ్ళపర్రు సగర్ల కాలనీలోకి వరద నీరు చేరింది. పాతవయ్యేరు గట్టున ఉన్న పల్లిపాలెం చుట్టు వరద నీరు చేరింది. ఆర్డీవో అంబరీష్‌ ముంపు ప్రాంతాలు, పునరావాస కేంద్రం పరిశీలించారు.

Updated Date - Sep 12 , 2024 | 12:34 AM