Share News

తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేయాలి

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:16 AM

శివ్వాం దళితుల భూవివాదంలో కలెక్టర్‌, బాఽధితులకు గరుగుబిల్లి తహసీల్దార్‌ అందించిన నివేదికలో చాలా అవకతవకలు చోటుచేసుకున్నాయని, పెత్తందార్లకు అనుకూలంగా వ్యవహరించడంతో ఆయన్ను సస్పెండ్‌ చేయాలని వ్యవసాయ, కార్మిక, కేవీపీఎస్‌, రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం పార్వతీపురంలోని సుందరయ్య భవన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు వ్యవసాయ, కార్మిక, కేవీపీఎస్‌, రైతు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు.

  తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేయాలి
నిరసన తెలుపుతున్న వ్యవసాయ, కార్మిక, కేవీపీఎస్‌ సంఘం నాయకులు:

బెలగాం: శివ్వాం దళితుల భూవివాదంలో కలెక్టర్‌, బాఽధితులకు గరుగుబిల్లి తహసీల్దార్‌ అందించిన నివేదికలో చాలా అవకతవకలు చోటుచేసుకున్నాయని, పెత్తందార్లకు అనుకూలంగా వ్యవహరించడంతో ఆయన్ను సస్పెండ్‌ చేయాలని వ్యవసాయ, కార్మిక, కేవీపీఎస్‌, రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం పార్వతీపురంలోని సుందరయ్య భవన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు వ్యవసాయ, కార్మిక, కేవీపీఎస్‌, రైతు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు ఎం.కృష్ణమూర్తి తదితరులు మాట్లాడుతూ శివ్వాం దళితుల భూ వివాదంలో కలెక్టర్‌కు గరుగుబిల్లి తహసీల్దార్‌ ఇచ్చిన నివేదికలో అవాస్తవాలు ఉన్నాయని, వాస్తవాలు కప్పిపుచ్చి పెత్తందారులకు అనుకూ లంగా నివేదిక సమర్పించారని తెలిపారు. దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని కోరారు.

Updated Date - Sep 12 , 2024 | 12:16 AM