వరద బాధితులకు అండగా నిలవండి
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:14 AM
విజయవాడ వరద బాధితులకు అండగా నిలవాలని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పిలుపుని చ్చారు. బుధవారం మండలంలోని లఖనాపురంలో విరాళాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితులకు అసౌకర్యం కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు నారా లోకేష్‌తో పాటు పలువురు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని తెలిపారు.
గరుగుబిల్లి: విజయవాడ వరద బాధితులకు అండగా నిలవాలని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పిలుపుని చ్చారు. బుధవారం మండలంలోని లఖనాపురంలో విరాళాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితులకు అసౌకర్యం కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు నారా లోకేష్‌తో పాటు పలువురు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల నుంచి విరాళాలు సేకరించి ముఖ్యమంత్రికి అందించనున్నట్లు చెప్పారు. అరకు పార్లమెంట్ కార్యనిర్వ హక కార్యదర్శి ముదిలిబాబు విజయవాంకుశం రూ. 10 వేలు, టి.గంగ బాబు రూ. 10 వేలు, గ్రామానికి చెందిన పలువురు రూ. 6,500ను ఎమ్మె ల్యేకు అందించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు ఎ.మధుసూదన రావు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి ఎం.పురుషోత్తంనాయుడు, రావి వలస ఎంపీటీసీ సభ్యులు కె.భరత్‌కుమార్, ఎం.సింహాచలం నాయుడు, డొంకాడ రామకృష్ణ, బొంగు సురేష్ పాల్గొన్నారు.
భోగి-గొటివాడ గెడ్డపై వంతెన నిర్మిస్తాం..
కురుపాం రూరల్: భోగి-గొటివాడ గెడ్డపై వంతెన నిర్మిస్తామని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి గొటివాడ హామీఇచ్చారు. బుధవారం భోగిగెడ్డ పరిసరాల్లో పర్యటించారు. భోరి-గొటివాడ గ్రామస్థులు శ్రమదానంచేసి కర్రలతో ఏర్పాటుచేసిన బ్రిడ్జిని ఎమ్మెల్యే పరిశీలించారు. భోరి-గొటివాడ గెడ్డపై బ్రిడ్జి నిర్మిస్తే పదుల సంఖ్యలో గ్రామాలకు కనెక్టివిటీ వస్తుందని, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన పాములు పుష్ప శ్రీవాణి కూడా బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇచ్చారని, అయితే పనులు ప్రారంభించలేదని స్థానికులు వివరించారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా రంజిత్‌కుమార్, టీడీపీ మం డలాధ్యక్షుడు కలిశెట్టి కొండయ్య, మాజీ ఎంపీపీ రమణమూర్తి పాల్గొన్నారు.