ఎయిర్‌పోర్టులో రక్షణ దళానికి స్థల పరిశీలన
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:22 AM
మండలంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో రక్షణ దళ అధికారులు శుక్రవారం స్థల పరిశీలన చేశారు.
భోగాపురం, నవంబరు29(ఆంధ్రజ్యోతి): మండలంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో రక్షణ దళ అధికారులు శుక్రవారం స్థల పరిశీలన చేశారు. ఎప్పుడైనా అత్యవసర సమయాల్లో ఎయిర్‌పోర్టును ఆధీనంలోకి తీసుకునే విధంగా ప్రతి ఎయిర్ పోర్టులో 10 ఎకరాల స్థలం కేటాయించే విధంగా రక్షణదళం అగ్రిమెంటు చేసుకుంటుంది. ఇందులో భాగంగా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో కూడా రక్షణ దళానికి 10 ఎకరాలు స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలాన్ని నేవీ కమాండెంట్ శివాజీ యాదవ్, సతీష్‌కుమార్, ప్రకాశ్‌చంద్, తదితర అధికారులు పరిశీలించారు. ఎయిర్‌పోర్టు, నేవీ అధికారులకు కేటాయించిన స్థలం, తదితర వివరాలకు సంబంధించిన మ్యాప్‌లు పరిశీలించారు. విజయ నగరం ఆర్డీవో దాట్లకీర్తి, తహసీల్దార్ ఎం.సురేష్, ఆర్‌ఐ ఇమ్రాన్, జీఎం ఆర్‌కు చెందిన రామరాజు, కోటేశ్వరరావు, సుబ్బారావు పాల్గొన్నారు.