Share News

డీఎస్సీ నోటిఫికేషన్‌ కాపీలకు నిప్పు

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:02 AM

ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో మళ్లీ అప్రంటీస్‌ విధానాన్ని ప్రవేశపెడుతూ డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వడాన్ని ఉపాధ్యాయులు నిరసించారు. స్థానిక గాంధీ విగ్రహం ముందు సోమవారం రాత్రి యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నోటిఫికేషన్‌ కాపీలను దగ్ధం చేశారు.

డీఎస్సీ నోటిఫికేషన్‌ కాపీలకు నిప్పు
డీఎస్సీ నోటిఫికేషన్‌ కాపీలను దహనం చేస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

డీఎస్సీ నోటిఫికేషన్‌ కాపీలకు నిప్పు

అప్రంటీస్‌ విధానంపై నిరసన

బొబ్బిలి, ఫిబ్రవరి 12: ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో మళ్లీ అప్రంటీస్‌ విధానాన్ని ప్రవేశపెడుతూ డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వడాన్ని ఉపాధ్యాయులు నిరసించారు. స్థానిక గాంధీ విగ్రహం ముందు సోమవారం రాత్రి యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నోటిఫికేషన్‌ కాపీలను దగ్ధం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ నేత విజయగౌరి మాట్లాడుతూ మెగా డీఎస్సీ అని నిరుద్యోగులను ఎంతగానో ఊరించి ఎన్నికల ముందు తీరిగ్గా అరకొర పోస్టులతో నోటిఫికేషన్‌ జారీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. వైఎస్‌ హయాంలో అప్రంటీస్‌ విధానాన్ని రద్దు చేయగా జగన్‌ పునరుద్ధరించడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులన్నింటికీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, అప్రంటీస్‌ విధానాన్ని రద్దు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 13 , 2024 | 12:02 AM