Share News

వణికిపోతున్నారు..

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:20 AM

శిథిలావస్థలో భవనాలు.. చాలీచాలని గదులు.. నిరుపయోగంగా మరుగుదొడ్లు.. పెచ్చులూడుతున్న స్లాబులు.. ఊడుతున్న తలుపులు.. కిటికీలు.. ఇదీ జిల్లాలోని పలు ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పరిస్థితి. కనీస మౌలిక వసతులు కొరవడడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వణికిపోతున్నారు..
సీతంపేట రూరల్‌: గురుకుల బాలుర పాఠశాలలో నేలపై పడుకున్న గిరిజన విద్యార్థులు

కటిక నేలపైనే విద్యార్థుల పడక

ఓ వైపు చలి.. మరోవైపు దోమలు

కంటి నిండా నిద్రించలేని పరిస్థితి..

పార్వతీపురం , నవంబరు29 (ఆంధ్రజ్యోతి): శిథిలావస్థలో భవనాలు.. చాలీచాలని గదులు.. నిరుపయోగంగా మరుగుదొడ్లు.. పెచ్చులూడుతున్న స్లాబులు.. ఊడుతున్న తలుపులు.. కిటికీలు.. ఇదీ జిల్లాలోని పలు ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పరిస్థితి. కనీస మౌలిక వసతులు కొరవడడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వారిని వసతి సమస్య వేధిస్తోంది. చాలాచోట్ల మంచాలు లేక విద్యార్థులు కటిక నేలపైనే పడుకోవాల్సి వస్తోంది. కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేకపోవడంతో విద్యార్థులు చలికి వణికిపోతున్నారు. మరోవైపు వారికి దోమల బెడద తప్పడం లేదు. మొత్తంగా వారు కంటి నిండా నిద్రించలేని పరిస్థితి. జిల్లాలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలను ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించగా పలు సమస్యలు వెలుగుచూశాయి.

Updated Date - Nov 30 , 2024 | 12:20 AM