Share News

సవర లిపిని దైవంగా కొలిచి..

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:24 AM

భామిని మండలం సతివాడ పంచాయతీ నూకాలమ్మ కొండ శిఖర గ్రామంలో ఆదివారం అక్షర బ్రహ్మ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు.

 సవర లిపిని దైవంగా కొలిచి..
అక్షరబ్రహ్మ ఆలయంలో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గొమాంగో తదితరులు

నూకాలమ్మ కొండ శిఖర గ్రామంలో ప్రారంభోత్సవం

భామిని, అక్టోబరు20 (ఆంధ్రజ్యోతి): భామిని మండలం సతివాడ పంచాయతీ నూకాలమ్మ కొండ శిఖర గ్రామంలో ఆదివారం అక్షర బ్రహ్మ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. సవర లిపిని అక్షర బ్రహ్మగా పూజించే గిరిపుత్రులు ఆలయాన్ని నిర్మించడం గొప్ప విషయమని ముఖ్య అతిఽథిగా హాజరైన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గొమాంగో అన్నారు. అక్షరాన్ని దైవంగా భావించి పూజించడం అభివృద్ధికి సంకేతమన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ఇటువంటి ఆలయాలు , కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. సవర లిపిని మరింత వెలుగులోకి తేవాల్సి ఉందన్నారు. అనంతరం అక్షర బ్రహ్మ ఆలయ విశిష్టతను చెబుతూ గిరిజనులతో కలిసి సంప్రదాయ నృత్యాలలో పాల్గొన్నారు టీడీపీ పాలకొండ ఇన్‌చార్జి పడాల భూదేవి, సామాజిక వేత్త గీతా శ్రీకాంత్‌ , అక్షర బ్రహ్మ గురువు మంగయ్య, సర్పంచ్‌ సంజీవరావు, ఆదివాసీలు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:24 AM