ఏఎస్పీగా సౌమ్యలత
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:02 PM
జిల్లా అదనపు ఎస్పీగా సౌమ్యలత మంగళవారం తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
విజయనగరం క్రైం, అక్టోబరు 1: జిల్లా అదనపు ఎస్పీగా సౌమ్యలత మంగళవారం తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈమె ఏసీబీలో పని చేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. డైరక్టు డీఎస్పీగా ఎంపికైన సౌమ్యలత గతంలో బొబ్బిలి, ఇంటిలిజెన్స్, ఏసీబీ తదితర విభాగాల్లో సమర్థ వంతంగా పనిచేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్‌ను మర్యాదపూర్వకంగా ఆమె కలిశారు. జిల్లా పోలీసు కార్యాలయ పనితీరును పర్యవేక్షించాలని, రాష్ట్ర డీజీపీ కార్యాలయం, రేంజ్ పోలీసు కార్యాలయాలతో జరపాల్సిన ఉత్తర, ప్రత్యుత్తరాల్లో ఎటువంటి కాలయాపన ఉండకూడదని ఎస్పీ ఆదేశించారు. ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సౌమ్యలతకు డీఎస్పీలు శ్రీనివాసరావు, వీరకు మార్, సీఐలు, ఆర్‌ఎస్‌ఐలు పలువురు పోలీసు అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.