Share News

రోడ్డు సౌకర్యం కల్పించాలి

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:26 AM

మండలం లోని లేవిటి నుంచి నీలకంఠాపురం ప్రధాన రహదారి వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి ఆ గ్రామ ప్రజలు ఆదివారం వినతిపత్రం అందించారు.

రోడ్డు సౌకర్యం కల్పించాలి

గుమ్మలక్ష్మీపురం: మండలం లోని లేవిటి నుంచి నీలకంఠాపురం ప్రధాన రహదారి వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి ఆ గ్రామ ప్రజలు ఆదివారం వినతిపత్రం అందించారు. గుమ్మలక్ష్మీపురంలోని తన స్వగృహంలో ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరించారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేక అత్యవసర సమయాల్లో వైద్యసేవలు అందడం లేదని, రాకపోకలకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహేంద్రపురం గ్రామానికి రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తానని, రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు.

Updated Date - Sep 16 , 2024 | 12:26 AM