ఎస్సీ వర్గీకరణపై నిరసన
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:33 AM
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ గరివిడి పట్టణంలో చీపురుపల్లి నియోజకవర్గంలో గల దళితులు బుధవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.
గరివిడి: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ గరివిడి పట్టణంలో చీపురుపల్లి నియోజకవర్గంలో గల దళితులు బుధవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక రైల్వే బ్రిడ్జి నుంచి ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ తహసీల్దారు కార్యాలయం వరకు వెళ్లారు. అక్కడ ప్రధాన రహదారిపై మానవహారం చేపట్టి ధర్నాకు దిగారు. అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం విభజనను వ్యతిరేకిస్తూ తహసీల్దారుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో గల నాలుగు మండలాల దళిత నేతలు పాల్గొన్నారు.