ఆపన్నులకు సాయం
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:03 AM
విజయవాడ వరద బాధితులకు సాయం అందించే కర్తవ్యంలో భాగంగా జిల్లా నుంచి రెండు లక్షల వాటర్ ప్యాకెట్లతో కూడిన రెండు ట్రక్కులు బుధవారం జిల్లా కేంద్రం నుంచి బయలుదేరాయి. జిల్లా తరపున గ్రామీణ నీటి సరఫరా విభాగం వాటిని ఏర్పాటు చేసింది.
ఆపన్నులకు సాయం
విజయవాడ వరద బాఽధితులకు జిల్లా నుంచి సహాయం
కలెక్టరేట్/ విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 4: విజయవాడ వరద బాధితులకు సాయం అందించే కర్తవ్యంలో భాగంగా జిల్లా నుంచి రెండు లక్షల వాటర్ ప్యాకెట్లతో కూడిన రెండు ట్రక్కులు బుధవారం జిల్లా కేంద్రం నుంచి బయలుదేరాయి. జిల్లా తరపున గ్రామీణ నీటి సరఫరా విభాగం వాటిని ఏర్పాటు చేసింది. వాహనాలను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్‌జిందాల్ బుధవారం ప్రారంభించారు. అలాగే జిల్లా స్వయంశక్తి మహిళా సంఘాలన్నీ కలిపి సీఎం సహాయ నిధికి రూ.10 లక్షలను బుధవారం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ద్వారా అందించారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సత్యవతి, కార్యదర్శి జనని పాల్గొన్నారు. కాగా బాధితులకు తాముసైతం అండగా ఉంటామంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా ప్రతినిధులు రూ.25 లక్షల సాయం ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టరు జయచంద్రనాయుడు, ఇతర ప్రతినిధులతో కలిసి విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రూ.25 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఐఎంఏ ప్రతినిధులు ఫణిధర్, నందకిషోర్, రవీంద్రనాథ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
---------------------