వ్యాధుల నివారణకు చర్యలు: డీఎంహెచ్‌వో
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:22 AM
వ్యాధుల నివారణకు వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు కోరారు. బుధవారం మండలంలోని ఎం.వెంకటాపురం లో నిర్వహించిన వైద్యశిబిరం పరిశీలించారు.
గజపతినగరం: వ్యాధుల నివారణకు వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు కోరారు. బుధవారం మండలంలోని ఎం.వెంకటాపురం లో నిర్వహించిన వైద్యశిబిరం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామాల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా వైద్యశిబిరాలను నిర్వహించాలని సూచించారు. ఇంటింటా సర్వే చేపట్టి జ్వరపీడితులను గుర్తించి అవసరమైన మందులను అందజేయాలని కోరారు. ప్రతి రోజూ క్లోరినేషన్ చేసిన నీటిని తాగాలని సూచించారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది ప్రజలకు అందు బాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో పుష్పాంజలి, సుష్మా సీహెచ్‌వో కళ్యాణి పాల్గొన్నారు.