టీడీపీలో భారీగా చేరికలు
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:00 PM
తెలుగుదేశం పార్టీలో మంగళవారం వైసీపీ నుంచి భారీగా చేరికలు జరిగాయి. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమక్షంలో మెంటాడ మండలం లోతుగెడ్డ సర్పంచ్ సారా భీమారావు, వార్డు మెంబర్లు లకాయి కొండమ్మ, అంటిపర్తి అప్పలరాము, రొంగలి బుచ్చిదొర, తూపుడు పోలమ్మతో పాటు సుమారు 110 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
-మంత్రి సంధ్యారాణి సమక్షంలో చేరిన 110 కుటుంబాలు
మెంటాడ, అక్టోబరు 1: తెలుగుదేశం పార్టీలో మంగళవారం వైసీపీ నుంచి భారీగా చేరికలు జరిగాయి. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమక్షంలో మెంటాడ మండలం లోతుగెడ్డ సర్పంచ్ సారా భీమారావు, వార్డు మెంబర్లు లకాయి కొండమ్మ, అంటిపర్తి అప్పలరాము, రొంగలి బుచ్చిదొర, తూపుడు పోలమ్మతో పాటు సుమారు 110 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమష్టి కృషితోనే గ్రామాభివృద్ధి సాధ్యమని, మంత్రిగా తనవంతు పూర్తి సహకారం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు. గిరిజనులు ఎంతో నమ్మకంతో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేసిన తనను సర్పంచ్‌గా గెలిపించారని, అయినా వారికి ఏమీ చేయలేకపోయానని సర్పంచ్ భీమారావు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో తనకు అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయని అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా రాజన్నదొర ఉండి కూడా తమ సమస్యలు పట్టించుకోలేదని, అందుకే పార్టీ వీడినట్లు సర్పంచ్‌తోపాటు వార్డు మెంబర్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూరెడ్డి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.