స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందాం
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:12 AM
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుందా మని ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు పండు, రవి అన్నారు.
బెలగాం: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుందా మని ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు పండు, రవి అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ పట్టణంలో కళాశాల విద్యార్థులతో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ 32 మంది ప్రాణ త్యాగం చేసి సాధించు కున్న స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవడం దారుణమ న్నారు. ఈ దీక్షకు సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. సంఘ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.