Share News

జ్వరంతో కేజీబీవీ విద్యార్థిని..

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:24 AM

కొమరాడ కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని కె.శారద(14) జ్వరంతో మంగళవారం రాత్రి మృతి చెందింది.

 జ్వరంతో కేజీబీవీ విద్యార్థిని..

కొమరాడ: కొమరాడ కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని కె.శారద(14) జ్వరంతో మంగళవారం రాత్రి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. జాకూరుకు చెందిన శారదకు గత నెల 18 నుంచి జ్వరంతో బాధపడుతోంది. స్థానికంగా ఉన్న పీహెచ్‌సీలో వారం రోజుల పాటు చికిత్స పొందింది. అయినా పరిస్థితి మెరుగవ్వలేదు. దీంతో కేజీబీవీ సిబ్బంది ఆ బాలికను గత నెల 23న జి ల్లా కేంద్రాసుపత్రికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో సెప్టెంబ రు 26న విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అప్పటికే టైఫాయిడ్‌, మలేరియా, డెంగ్యూతో బాధపడుతున్న ఆ బాలికకు ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోవడంతో మృతి చెంది నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సకాలంలో వైద్యసేవలు అంది ఉంటే తమ కూమార్తె బతికేదని తల్లిదండ్రులు నర్సింహులు, దానమ్మ తెలిపారు.

Updated Date - Oct 02 , 2024 | 12:24 AM