పర్యాటక అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:30 AM
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరిం చుకుని 2023-24 సంవత్సరానికి వివిధ విభాగాల్లో అవార్డులకు అర్హులై పర్యాటక సంబంధిత రంగాల వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా పర్యాటక శాఖాధికారి ఎన్.నారాయణరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరిం చుకుని 2023-24 సంవత్సరానికి వివిధ విభాగాల్లో అవార్డులకు అర్హులై పర్యాటక సంబంధిత రంగాల వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా పర్యాటక శాఖాధికారి ఎన్.నారాయణరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 38 విభాగాల నుంచి 41 అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. దరఖాస్తులను ఏపీ టూరిజం వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి చేసిన వాటిని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఐదో ఫ్లోర్, స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, ఆటోనగర్, విజయవాడలో ఈనెల 22వ తేదీలోగా అందించాలన్నారు.