Share News

పెరిగిన వంట నూనెల ధరలు

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:17 AM

వంట నూనెలపై కేంద్రం దిగుమతి సుంకం పెంచడంతో వాటి ధరలు అమాంతం పెరిగాయి. 15 కిలోల డబ్బా ధర శుక్రవారం వరకు రూ.1730 ఉండగా, శనివారానికి రూ.1950, ఆదివారానికి రూ.2 వేలు దాటింది. కిలో ప్యాకెట్‌ ధర రూ.108 నుంచి రూ.125కు పెరిగింది.

పెరిగిన  వంట నూనెల ధరలు

పార్వతీపురం, సెప్టెంబరు15(ఆంధ్రజ్యోతి) : వంట నూనెలపై కేంద్రం దిగుమతి సుంకం పెంచడంతో వాటి ధరలు అమాంతం పెరిగాయి. 15 కిలోల డబ్బా ధర శుక్రవారం వరకు రూ.1730 ఉండగా, శనివారానికి రూ.1950, ఆదివారానికి రూ.2 వేలు దాటింది. కిలో ప్యాకెట్‌ ధర రూ.108 నుంచి రూ.125కు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కిలో ఆయిల్‌ ప్యాకెట్‌కు అదనంగా రూ.5 పెంచి విక్రయిస్తున్నారు. దీంతో వినియోగ దారులు బెంబేలెత్తిపోతున్నారు. వంట నూనెల ధరల పెంపుపై జిల్లావాసులు మండిపడుతున్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న తమపై ఈ భారం మోపడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. వంటింటి బడ్జెట్‌ ఒక్కసారిగా పెరిగిందని సామాన్య, మధ్యతరగతి కుటుంబాల వారు, హోటల్‌ నిర్వాహకులు వాపోతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:17 AM