విద్యుదాఘాతంతో గీత కార్మికుడి మృతి
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:22 AM
మండలంలోని కొండదేవుపల్లిలో మంగళవారం గీత కార్మి కుడు రాగోలు కృష్ణ (50) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.
బొబ్బిలి రూరల్: మండలంలోని కొండదేవుపల్లిలో మంగళవారం గీత కార్మి కుడు రాగోలు కృష్ణ (50) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. రాగోలు కృష్ణ సాయంత్రం పామాయిల్ తోటలో గెలలు కోయడానికి భుజంపై ఇనుప బొరిగి పెట్టుకొని వెళ్తున్నాడు. పంట పొలంలో గల గట్టుపై వేలాడుతున్న విద్యుత్ తీగలు ఆయన భుజంపై ఉన్న ఇనుప బొరిగికి తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తె లుసుకున్న గ్రామస్థులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ యనకు భార్య రాగోలు లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు సింహాచలం, కుమారి ఉన్నారు.