చెత్తను తక్షణమే తొలగించాలి
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:18 AM
పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న వ్యర్థా లు, చెత్తను తక్షణమే తరలించాలని సీఐటీయూ జిల్లాఅధ్యక్షుడు దావాల రమ ణారావు డిమాండ్ చేశారు.బుధవారం నగర పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
పాలకొండ: పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న వ్యర్థా లు, చెత్తను తక్షణమే తరలించాలని సీఐటీయూ జిల్లాఅధ్యక్షుడు దావాల రమ ణారావు డిమాండ్ చేశారు.బుధవారం నగర పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయాలని కోరారు. నిరంతరం సంచరించే ప్రాంతాల్లో చెత్తవేయడంతోపౌరులు అనారోగ్యం పాలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి కాదరాము, ఏపీ మున్సిప ల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పాలకొండ కమిటీ కార్యదర్శి సీహెచ్ సంజీవి, వ్యవసాయకార్మిక సంఘ నాయకులు దూసి దుర్గారావు పాల్గొన్నారు.