Share News

ఉచిత ఇసుక అమలు చేయాలి

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:15 AM

రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉచిత ఇసుక హామీ తక్షణమే అమలు చేసి, భవన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరా వు డిమాండ్‌ చేశారు.

ఉచిత ఇసుక అమలు చేయాలి

బెలగాం: రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉచిత ఇసుక హామీ తక్షణమే అమలు చేసి, భవన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరా వు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఐటీ యూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద నిరసన దీక్షలు చేపట్టారు. ఉచిత ఇసుక అమలు చేయాలని మూడు రోజుల పాటు నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జి.రమణ, దిలీప్‌, నాగేశ్వరరావు, అశోక్‌ కుమార్‌, భవన నిర్మాణ రంగ కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:15 AM