విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాలి
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:10 AM
ప్రస్తుతం విద్యా వ్యవస్థ అధ్వానంగా మారిందని, ఇటువంటి సమయంలో విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాలని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు.
- కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు
విజయనగరం దాసన్నపేట, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం విద్యా వ్యవస్థ అధ్వానంగా మారిందని, ఇటువంటి సమయంలో విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాలని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. విజయనగరంలో శుక్రవారం జరిగిన ఏఐఏఎఫ్ 49వ రాష్ట్ర ముగింపు సభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘ప్రతి విద్యార్థిలోనూ ఆలోచన శక్తి ఉంటుంది. దానికి పదును పెట్టాలి. విద్యతోనే మీకు, మీ కుటుంబానికి, సమాజానికి న్యాయం చేయగలరు. ఉత్తరాంధ్ర నుంచే అనేకమంది విద్యాశాఖ మంత్రులుగా పని చేసినా 1,050 ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం బాధాకరం.’ అని అన్నారు. ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ.. ఏఐఏఎఫ్ పోరాటాల ఫలితంగా అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని అన్నారు. మీలాంటి విద్యార్థి నేతలే రేపటి సమాజంలో ప్రశ్నించే నేతలుగా మారతారని పేర్కొన్నారు. వసతిగృహాల పరిస్థితి అధ్వానంగా ఉందని, తాను స్వయంగా పరిశీలించిన సమయంలో సమస్యలు బయటపడ్డాయన్నారు. సమస్యలపై పోరాటం చేసే సమయంలో తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు కామేశ్వరరావు, ఒమ్మి రమణ, బుగత అశోక్, ఆనందరావు, రంగరాజు, ఏఐఎఎఫ్ ప్రతినిధులు దినేష్, జాన్సన్‌బాబు, శివారెడ్డి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.