Share News

93 శాతం పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Nov 30 , 2024 | 11:45 PM

జిల్లాలో పింఛన్‌దారులకు ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ సొమ్ము అందించారు. ఒకటో తేదీ ఆదివారం కావడంతో శనివారం ఉదయాన్నే సచివాలయ సిబ్బంది, ఇతర శాఖల ఉద్యోగులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. తుఫాన్‌ కారణంగా కురుస్తున్న జోరువానను సైతం లెక్కచేయకుండా పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు.

93 శాతం పింఛన్ల పంపిణీ
సాలూరులో లబ్ధిదారులకు పింఛన్‌ సొమ్ము అందిస్తున్న మంత్రి సంధ్యారాణి

ఆనందంలో లబ్ధిదారులు

పార్వతీపురం/సాలూరు/రూరల్‌, నవంబరు30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పింఛన్‌దారులకు ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ సొమ్ము అందించారు. ఒకటో తేదీ ఆదివారం కావడంతో శనివారం ఉదయాన్నే సచివాలయ సిబ్బంది, ఇతర శాఖల ఉద్యోగులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. తుఫాన్‌ కారణంగా కురుస్తున్న జోరువానను సైతం లెక్కచేయకుండా పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. గిరిశిఖర గ్రామాల్లో లబ్ధిదారులకు కూడా మధ్యాహ్నం లోగా నగదు అందించారు. ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు భాగస్వాములయ్యారు. సాలూరు పట్టణం గొల్లవీధిలో లబ్ధిదారులకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పింఛన్‌ సొమ్ము అందజేశారు. జిల్లాలో 1,41,307 వివిధ రకాల పింఛన్లకు గాను 1,32,480 మందికి రూ. 55.08 కోట్లు అందించారు. వివిధ కారణాలతో అక్టోబరులో నగదు అందుకోలేకపోయిన 489 మందికి రెండు నెలలు కలిపి పింఛన్‌ సొమ్ము అందించారు. గత నెల బకాయితో పాటు ముందస్తుగా పింఛన్‌ అందించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సాయంత్రానికి 93 శాతం మేర పింఛన్ల పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీ వై.సత్యంనాయుడు తెలిపారు. మిగిలినవి సోమవారం పంపిణీ చేస్తామన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 11:45 PM